భారత్ కు పశ్చిమాన ఉన్న అతిపెద్ద రాష్ట్రం పశ్చిమ బెంగాల్. అత్యధిక ఎంపీ స్థానాలున్న రాష్ట్రాల్లో బెంగాల్ రెండవది. కేంద్రంలో అధికారంలోకి రావడానికి.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఇక్కడున్న ఎంపీలు కీలకంగా మారనున్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని తృణమూల్ కాంగ్రెస్ పాలిస్తోంది.
లోక్‌సభ అత్యధిక స్థానాలున్న రాష్ట్రాల్లో యూపీ(80) మొదటిది అయితే పశ్చిమ బెంగాల్ (42) రెండవది. గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి 34 మంది ఎంపీలు గెలుపొందారు. అయితే మిగతా చోట్ల బీజేపీకి అత్యధిక స్థానాలు రావడంతో ఎన్డీయేకు తృణమూల్ అవసరం రాలేదు. పైగా మొదటి నుంచి కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్న ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ ఎన్డీయేకు ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంటూ వస్తున్నారు.
గత నెలలో శారదా చిట్ ఫండ్ కేసులో మోడీ వర్సెస్ దీదీ అన్నట్లుగా సాగింది. ఈ కేసు వ్యవహారంలో పోలీస్ కమిషనర్ రాజీవ్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు కలకత్తా వెళ్లారు. అయితే రాజీవ్‌ను రక్షించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి మమతా రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. అప్పుడు మమత నిరసన దీక్ష కూడా చేపట్టారు. 'రాష్ట్రాల్లో మోడీ జోక్యం చేసుకోవడమేంటని' మండిపడ్డారు. అయితే ఈ కేసు సుప్రీంకు వెళ్లడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది.
తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది. ఈ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసిన దీదీ మోడీనే టార్గెట్ చేశారు. పశ్చిమ బెంగాల్ ను నాశనం చేయడానికే మోడీ కంకణం కట్టుకున్నారని విమర్శించారు. 2014లో ఐదు దశల్లో పోలింగ్ నిర్వహిస్తామంటే ఒప్పుకోని ప్రధాని.. ఇప్పుడు ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించడమేంటని ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో మోడీని కచ్చితంగా గద్దె దింపే ప్రయత్నం చేస్తామన్నారు. అయితే అటు కాంగ్రెస్ తోనూ.. ఇటు ఫ్రంట్ తోనూ కలిసి వస్తామంటున్న మమతా ఎవరితో పొత్తుకు వెళ్తారనేది మాత్రం క్లారిటీగా చెప్పడం లేదు. కానీ 42 స్థానాలున్న రాష్ట్రంలో గతంలో 34 విజయం సాధించామని, వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని మమతా ఉద్ఘాటించారు. తమ రాష్ట్రం కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి కీలకంగా మారనుందని చెప్పారు. దీంతో ఇప్పుడు అంతా మోడీ వర్సెస్ దీదీ అంటూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు. మరి ఈ రేసులో ఎవరు గెలుస్తారో చూడాలి..