నాన్ ఎన్డీయే పక్షాలకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెద్ద షాక్ ఇచ్చారు. బద్ధ శతృవైన జగదీప్ ధన్ కర్ కే పరోక్షంగా మద్దతు ప్రకటించారు. ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే తరపున ప్రస్తుత బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక నాన్ ఎన్డీయే పక్షాల తరపున కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరెట్ ఆల్వా పోటీలో ఉన్నారు. ధనకర్ కు మమతకు మధ్య సంబంధాలు ఉప్పునిప్పులాగున్న విషయం దేశమంతా తెలిసిందే.
ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించుకునేందుకు ఎంతలా గొడవపడ్డారో అందరు చూసిందే. అలాంటి ధనకర్ కు పరోక్షంగా ఉపయోగపడేలాగ మమత ఉపరాష్ట్రపతి ఎన్నికను బహిష్కరించాలని డిసైడ్ చేశారు. ఆల్వా అభ్యర్ధిత్వాన్ని నిర్ణయించే ముందు మమత ఆమోదం తీసుకోలేదని ఆమె మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు. టీఎంసీని పరిగణలోకి తీసుకోకుండా ఆల్వాను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.
మమత తాజా నిర్ణయాన్ని నాన్ ఎన్డీయే పక్షాలన్నీ తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ముందుగా అందరు సమావేశమై తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఇపుడు మమత తప్పుపట్టడాన్ని మిగిలిన పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి.
ఈ మధ్యనే అస్సాం ముఖ్యమంత్రి సమక్షంలో మమత-థనకర్ భేటీ జరిగింది. నిజంగా ధనకర్ తో మమత భేటీ అవుతారని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు అంత భయంకరంగా ఉన్నాయి. అలాంటిది ధనకర్ ను మమత కలవటం ఏమిటబ్బా అని చాలామంది ఆశ్చర్యపోయారు.
అప్పట్లోనే వీళ్ళ భేటీపై ఊహాగానాలు రేగాయి. అయితే ఇప్పుడు మమత నిర్ణయం తర్వాత ఎన్డీయే అభ్యర్ధి గెలుపుకు పరోక్షంగా సహకరించే ఉద్దేశ్యంతోనే మమత ఉపరాష్ట్రపతి ఎన్నికను బహిష్కరించాలని డిసైడ్ చేసినట్లుగా మిగిలిన పార్టీలు అనుమానిస్తున్నాయి.
ఏదేమైనా నమ్ముకున్న పార్టీలను నిలువునా ముంచేయటం మమతకు మొదటినుండి ఉన్న అలవాటే. మమత ఎప్పుడెలా వ్యవహరిస్తారో తెలుసుకోవటం కష్టమనే ప్రచారానికి ఇదే తాజా ఉదాహరణ.