త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బెంగాల్ లో ఈ సారి ఎలాగైనా అధికారం చేపట్టాలని బీజేపీ విశ్వప్రయత్నం చేస్తున్నది. ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. దీదీని అన్ని రకాలుగా దెబ్బతిస్తున్నది బీజేపీ. కానీ మమతా బెనర్జీ సైతం ఫైటింగ్ స్పిరిట్‌తో ముందుకు సాగుతున్నారు. బీజేపీకి ఏ మాత్రం భయపడకుండా.. గట్టిగా పోరాడుతున్నారు. అయితే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై టైమ్స్‌నౌ - సీ ఓటర్ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. బెంగాల్లో బీజేపీ ఆశలు గల్లంతైనట్టేనని ఈ సర్వే తేల్చి చెప్పింది.
మరోసారి దీదీ అధికారం చేపట్టడం ఖాయమని సర్వేలో తేలింది. అయితే దీదీకి గత ఎన్నికలకంటే స్వల్పంగా సీట్లు తగ్గబోతున్నాయి. ఇక బీజేపీ కూడా పుంజుకోబోతున్నది. ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించబోతుందని సర్వే తేల్చి చెప్పింది. దీంతో ఎలాగైనా అధికారం చేపట్టాలని ఆశలు పెట్టుకున్న బీజేపీకి ఈ సారి నిరాశే ఎదురు కాబోతున్నదన్నమాట.
ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ 160 స్థానాల్లో గెలుపొంది. అధికారం చేపట్టబోతుందని ఈ సర్వే పేర్కొన్నది. 2016 ఎన్నికల్లో ఆ పార్టీ బంపర్ మెజార్టీని సాధించింది. 211 స్థానాలు గెలుచుకున్నది. అయితే ఈ సారి మాత్రం 51 సీట్లు తక్కువ వస్తాయని సర్వే రిపోర్ట్ పేర్కొన్నది.
ఇక 2011 ఎన్నికల్లో కేవలం 3 స్థానాలకే పరిమితమైన బీజేపీఈ సారి ఘననీయంగా ఓట్లను, సీట్లను సాధించబోతున్నదట. మరోవైపు ఎన్నో ఆశలతో పోటీచేస్తున్న కాంగ్రెస్, లెఫ్ట్ కూటమికి కూడా నిరాశే ఎదురుకాబోతున్నది. ఆ కూటమి కేవలం 22 స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తుందని సర్వే రిపోర్టు తేల్చింది.
ఈ సర్వే ప్రకారం.. టీఎంసీకి 42.1 శాతం ఓట్లు , బీజేపీకి 37.4 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది.
2016 ఎన్నికల కంటే టీఎంసీకి 2.8 శాతం ఓట్లు తక్కువగా రావడం గమనార్హం. ఇక బీజేపీ గత ఎన్నికల్లో 10.2 శాతం నుంచి ఈ ఎన్నికలకు 27.2 శాతం ఓటింగ్ శాతాన్ని పెంచుకుంది. ఇక లెఫ్ట్ ఫ్రంట్-కాంగ్రెస్-ఇండియన్ సెక్యూరలర్ ఫ్రంట్ కూటమికి ఈ ఎన్నికల్లో 13 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. బీజేపీ కూటమికి 104-120 సీట్లు వస్తాయని సర్వే తేల్చి చెప్పంది. బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఉండాలని దాదాపు 55 శాతం మంది కోరుకుంటున్నారట. అంతేకాక.. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేసింది. ఇప్పటికే టీఎంసీకి చెందిన కీలక నేత సువెందు అధికారి బీజేపీలో చేరారు. అయినప్పటికీ ఆ పార్టీ విజయతీరాలను చేరుకోలేకపోతుందని సర్వే తేల్చింది.