వారణాసిలో దీదీ బిజీ బిజీ

Update: 2022-03-05 05:52 GMT
ఉత్తరప్రదేశ్లోని నరేంద్రమోడి పార్లమెంటు నియోజకవర్గం వారణాసిలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాడెనర్జీ చాలా బిజీ బిజీగా ఉన్నారు. మోడి టార్గెట్ గా మమత చాలా వేగంగా పావులు కదుపుతున్నారు. జరుగుతున్న ఎన్నికల్లో ఎస్పీ తరపున మమత ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. 7వ తేదీన ఏడే విడత, ఆఖరు పోలింగ్ జరగబోతోంది. ఇందులో బాగంగానే ఎస్పీ అధ్యక్షుడు ఈ ఎన్నికల్లో గెలుపును లైఫ్ అండ్ డెత్ గా తీసుకున్నారు.

 ఇదే సమయంలో రెండోసారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని బీజేపీ కూడా శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకనే మోడి, అమిత్ షా లు యూపీలో ఇప్పటిచే చాలాసార్లు ప్రచారం చేశారు. అందుకనే అఖిలేష్ యాదవ్ కు మద్దతుగా మమత కూడా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే దీదీ ప్రధానంగా వారణాసిలోనే క్యాంపువేశారు. ఎందుకంటే వారణాసి పరిధిలోని ఏడు అసెంబ్లీల్లో ఇపుడు బీజేపీ ఎంఎల్ఏలే ఉన్నారు. ఈ ఎన్నికల్లో వీళ్ళని దెబ్బకొట్టి సమాజ్ వాదీపార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవాలన్నది దీదీ ఆలోచన.

 ఇందుకనే దీదీ కంటిన్యూగా ప్రచారం చేస్తునే ఉన్నారు. తనకు ప్రత్యర్ధి మోడియే కానీ మరొకరు కాదు అని మమత దేశప్రజలకు స్పష్టం చేయదలచుకున్నారు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులను ఓడించటమే టార్గెట్ గా అఖిలేష్ తో పాటు దీదీ కూడా బాగా కష్టపడుతున్నారు. దీదీ జరిపిన రోడ్డుషోలు, ర్యాలీలకు విశేష స్పందన వచ్చిందట. నిజంగానే దీదీ ప్రచారం సక్సెస్ అవ్వటం వాస్తవమే అయితే రేపు పోలింగ్ లో దాని ప్రభావం కనబడుతుంది. కనీసం మూడు నియోజకవర్గాల్లో బీజేపీ ఓడిపోయినా దీదీ సక్సెస్ అయినట్లే అనుకోవాలి.

ప్రచారానికి ఈరోజే ఆఖరుగడువు. అందుకనే సుడిగాలి వేగంతో దీదీ వారణాసి పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీను చుట్టేస్తున్నారు. దీదీ ప్రభావం ఎంతన్నది ఇప్పటికి తెలియకపోయినా అఖిలేష్ మాత్రం చాలా అడ్వాంటేజ్ అనే చెప్పాలి.

ఒకరాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్రంలో ప్రతిపక్షనేతకు మద్దతుగా ఇంతలా కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేయటం అరుదనే చెప్పాలి. మమత తాజా ప్రచారంతోనే నరేంద్రమోడిపై ఎంతలా మండిపోతున్నారో అర్ధమైపోతోంది.

 
Tags:    

Similar News