బ‌స్సులో కోడికి టికెట్ కొట్టిన కండక్ట‌ర్!

Update: 2018-07-02 04:26 GMT
సోష‌ల్ మీడియా కార‌ణంగా చోటు చేసుకునే చెడు గురించి చాలామంది అదేప‌నిగా చెబుతుంటారు. కానీ.. ఆ మీడియం కార‌ణంగా మంచి కూడా జ‌రుగుతోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇవాల్టి రోజున ప్ర‌పంచంలో ఏ మూల‌న ఏం జ‌రుగుతున్నా.. చ‌టుక్కున అంద‌రికి తెలిసిపోతుందంటే.. సోష‌ల్ మీడియా దానికి కార‌ణంగా చెప్పాలి.

గాలి కంటే వేగ‌మ‌న్న‌ట్లుగా ఆస‌క్తిక‌ర విష‌యం అదే ప‌నిగా వైర‌ల్ అవుతున్న తీరుతో.. స‌మాచార మార్పిడి ఇప్పుడు చాలా సులువుగా మారింది. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని స‌రికొత్త విష‌యాలు తెలుస్తున్నాయి.

ఈ మ‌ధ్య‌న మ‌హారాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు అనుస‌రించే ఒక విష‌యం గురించిన స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చి ప‌లువురిని అవాక్కు అయ్యేలా చేసింది.

రోడ్ల మీద తెలిసినా.. తెలియ‌కున్నా.. ఎవ‌రైనా లిఫ్ట్ అడిగితే.. వెనుకా ముందు చూసుకోకుండా ఓకే అనేస్తాం. అయితే.. మ‌హారాష్ట్రలో మాత్రం తెలినీ వారికి లిఫ్ట్ ఇచ్చిన ప‌క్షంలో వారిపై కేసు న‌మోదు చేసి.. ఫైన్ వేస్తారు. దీనికి సంబంధించి ఒక సెక్ష‌న్ కూడా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రూల్ లేన‌ప్ప‌టికీ.. రానున్న రోజుల్లో ఈ త‌ర‌హా రూల్‌ ను తీసుకొచ్చే వీలుంద‌ని చెప్పాలి.

మ‌హారాష్ట్రలో అమ‌లు చేస్తున్న లిఫ్ట్ రూల్‌.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌క్కాగా అమ‌లు చేస్తే.. ఊహించ‌ని ప్ర‌మాదాల‌కు క‌ళ్లెం వేయొచ్చ‌న్న ఆలోచ‌న‌లో పోలీస్ శాఖ ఉన్న‌ట్లు చెబుతున్నారు. అయితే.. ఇలాంటి నిబంధ‌న‌ల కార‌ణంగా కొత్త స‌మ‌స్య‌లు మీద‌కు రావ‌టం ఖాయ‌మంటున్నారు.

ఇదిలాఉంటే.. తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం తెర మీద‌కు వ‌చ్చింది. బ‌స్సు ఎక్కితే టికెట్ తీసుకోవాల‌న్న విష‌యం చిన్న పిల్లాడికి తెలుసు. అయితే.. ప్ర‌యాణికుడు త‌న‌తో పాటు కోడిపెట్టను తీసుకెళుతుంటే? అన్న ప్ర‌శ్న వేస్తే.. దానికి టికెట్ ఎందుకుంటుంద‌న్న ప్ర‌శ్న వ‌స్తుంది. కానీ.. క‌ర్ణాట‌క‌లోని బ‌స్సుల్లో ప్ర‌యాణికులు వెంట తీసుకెళ్లే కోళ్ల‌కు టికెట్ కొట్టిన వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

బెంగ‌ళూరుకు స‌మీపంలోని గౌరిబిద‌నూరు తాలూకా ముద‌లోడు గ్రామానికి చెందిన శ్రీ‌నివాస్ రెండు కోళ్ల‌ను త‌న‌తో పాటు ఆర్టీసీ బ‌స్సులో తీసుకెళ్లారు. స‌ద‌రు బ‌స్సుకండక్ట‌ర్ శ్రీ‌నివాస్ కు ఒక ఫుల్ టికెట్‌.. అత‌ని చేతిలో ఉన్న రెండు కోళ్ల‌కు క‌లిపి హాఫ్ టికెట్ ఇచ్చారు. ఇదేం న్యాయ‌మ‌ని శ్రీ‌నివాస్ ప్ర‌శ్నిస్తే.. కోళ్లు.. గువ్వ‌లు..చిలుక‌లు లాంటి జీవుల్ని వెంట తీసుకెళుతుంటే.. వాటికి టికెట్ త‌ప్ప‌నిస‌రి అని క‌ర్ణాట‌క ఆర్టీసీ అధికారులు స్ప‌ష్టం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతానికైతే ఈ త‌ర‌హా రూల్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కొన్ని రాష్ట్రాల్లో అమ‌లు చేస్తున్న ఈ త‌ర‌హా రూల్స్ తో స్ఫూర్తి చెందితే మాత్రం ప్ర‌జ‌ల‌కు కొత్త తిప్ప‌లు గ్యారెంటీ.
Tags:    

Similar News