ఆ సీఎం ఫోటో పోస్ట్ చేశాడు.. అరెస్ట్ అయ్యాడు

Update: 2017-03-21 11:11 GMT
న‌చ్చిన వారిని ఆకాశానికి ఎత్తేసేలా పొగిడేయ‌టం.. న‌చ్చ‌ని వారిపై లేనిపోని వ్యాఖ్య‌లు.. ఫోటోల్ని సృష్టిస్తూ ప‌ర‌ప‌తిని దెబ్బ తీసే ప్ర‌య‌త్నాలు ఈ మ‌ధ్య‌న ఎక్కువైంది. సోష‌ల్ మీడియా విస్తృతి పెరిగిన త‌ర్వాత‌.. వ్యక్తిగ‌త అభిరుచుల‌కు త‌గ్గ‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ధోర‌ణి పెరిగింది. మొద‌ట్లో ఇలాంటి విష‌యాల్లో ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోన‌ప్ప‌టికీ.. త‌ర్వాతి కాలంలో మాత్రం చ‌ట్టం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌టం మొద‌లైంది.

తాజాగా యూపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన యోగి ఆదిత్య‌నాథ్ కు సంబంధించి అభ్యంత‌ర‌క‌ర ఫోటోల్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘ‌జియాపూర్ జిల్లా ప్రొఫెస‌ర్స్ కాల‌నీకి చెందిన 25 ఏళ్ల బాద్ షా అబ్దుల్ ర‌జాక్ అనే వ్య‌క్తి ఒక న‌కిలీ ఫేస్ బుక్‌ ఖాతాను తెరిచాడు. ముఖ్య‌మంత్రి యోగికి సంబంధించిన‌ట్లుగా చెప్పే కొన్ని అభ్యంత‌ర‌క‌ర ఫోటోల్ని పోస్ట్ చేశారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన వెంట‌నే ఈ ఫోటోల్ని పోస్ట్ చేయ‌టం.. ఇవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

ఈ ఉదంతం గురించి స‌మాచారం అందుకున్న హిందు యువ వాహిని కార్య‌క‌ర్త‌లు జిల్లా న్యాయ‌మూర్తి.. పోలీసు ఉన్న‌తాధికారుల నివాసాల ఎదుట నిరస‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించారు. ఈ వ్య‌వ‌హారంపై స్పందించిన పోలీసులు.. న‌కిలీ ఫేస్ బుక్ ఖాతాను తెరిచి.. ముఖ్య‌మంత్రి ప్ర‌తిష్ట దెబ్బ తీసేలా ఫోటోల్ని పోస్ట్ చేస్తున్న విష‌యాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. చేసిన నేరాన్ని నిందితుడు ఒప్పుకున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇలాంటి త‌ప్పులు చేసి.. అడ్డంగా బుక్ కావ‌టం అవ‌స‌ర‌మా..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News