ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆడియో టేపులు ఇప్పుడ సంచలనం రేపుతున్నాయి. తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడడానికి ముందు మరో వ్యక్తి గొంతు వినిపించింది. స్ఠీఫెన్‌సన్‌కు మూడో వ్యక్తి ఫోన్ కలిపి అందించారు. సోమవారం రాత్రి లీక్ అయిన ఆడియో రికార్డులు కలకలం రేపాయి. చంద్రబాబు స్టీఫెన్‌సన్‌తో నేరుగా మాట్లాడారు... తమకు మద్దతు ఇస్తే అండగా ఉంటామని చంద్రబాబు స్టీఫెన్‌సన్‌కు హామీ ఇవ్వడానికి సంబంధించి ఆ సంభాషణల్లో ఉంది.
అయితే... స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడడానికి ముందు ఓ గొంతు వినిపించింది. బాబుగారు మీతో మాట్లాడాలని అనుకుంటున్నారని, ఆయన లైనులో ఉన్నారని అంటూ ఓ వ్యక్తి స్టీఫెన్‌సన్‌కు చెప్పి ఫోన్‌ను చంద్రబాబుకు ఇచ్చారు. ఆ వ్యక్తి ఎవరనేది ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. చంద్రబాబుకు ఫోన్ కలిపి ఇచ్చిన వ్యక్తి ఎవరై ఉంటారనేది కేసులో కూడా కీలకం అవుతుందని భావిస్తున్నారు. తొలుత మాట్లాడింది ఎవరు, ఆ నెంబర్ ఏమిటి అనేది కూడా కీలకమే అవుతుందని అంటున్నారు. అతను చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడై ఉంటాడనేది అందరూ భావిస్తున్నారు. తనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులకు మాత్రమే చంద్రబాబు అటువంటి పనులు అప్పగిస్తారు.
దీంతో చంద్రబాబు సలహాదారులు... డిల్లీలో టీడీపీ కార్యక్రమాలు చక్కబెట్లే ఒక నేత కానీ కావొచ్చని సందేహిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ఫోన్‌ను ట్యాప్ చేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే, స్టీఫెన్‌సన్‌తో తాను మాట్లాడినట్లు లీకైన ఆడియోపై చంద్రబాబు ఇప్పటి వరకు కూడా నోరు విప్పలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూడా ఏమీ మాట్లాడడం లేదు. అయితే రాజకీయాలు మాత్రం వాడివేడిగా ఉన్నాయి.