భార్య‌ను ఎంత తెలివిగా మోస‌గించాడంటే

Update: 2016-07-22 14:30 GMT
పురుషుల‌పై మ‌హిళ‌లు స‌హ‌జంగా ఎందుకంత ద్వేషం పెంచుకుంటార‌నే కొంద‌రి ప్ర‌శ్న‌ల‌కు ఇలాంటి సంఘ‌ట‌ను తెలుసుకుంటే స‌మాధానం ఒకింత తేలిక‌గా దొరుకుతుంది. ఓ వ్య‌క్తి ఎనిమిది మందిని వివాహం చేసుకోవ‌డ‌మే కాకుండా అంద‌ర్నీ మోసం చేయ‌డం అందులో చివ‌రి మ‌హిళ‌ను దోచుకున్న తీరు క‌ల‌క‌లం సృష్టిస్తోంది.

తమిళనాడులోని మధురైకి చెంది భాను అనే మహిళకు స‌మీపంలోని మసీదుకు వెళ్లినప్పుడు తస్లీమా అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఇరువురి మధ్య పరిచయం స్నేహంగా మారింది. ఇరు కుటుంబాల విషయాలు - సమస్యలు ఒకరికొకరు పంచుకునే స్థాయికి వారి స్నేహం చేరుకుంది. కాగా తస్లీమా ఓ రోజు కబీర్ బాషా అనే వ్యక్తిని బంధువుగా పేర్కొంటూ భానుకు పరిచయం చేసింది. విరూదునగర్ జిల్లాలో ఎస్‌ బీఐ బ్యాంక్‌ లో ఫీల్డ్ ఆఫీసర్‌ గా పనిచేస్తున్నట్లు తెలిపింది. అతడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నట్లుగా పేర్కొంది. భాను మొదట సంకోచం వ్యక్తం చేసినప్పటికీ తస్లీమా బలవంతంతో పెళ్లికి అంగీకరించింది. దీంతో ఈ ఏడాది మేలో ఇరువురికి వివాహం జరిగింది. కొన్ని రోజులు సంసారం సాఫీగానే సాగిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత అస‌లు రూపం బ‌య‌ట‌ప‌డింది.

బాష వెళుతూ వెళుతూ ఇంట్లో ఉన్న రూ. 3.5 లక్షలు - ఎనిమిది తులాల బంగారు నగలు మాయమైనట్లు భాను గమనించింది. ఆందోళనకు గురై వెంటనే అతడికి ఫోన్ చేయ‌గా..ఓ పని మీద వాటిని తానే తీసుకెళ్తున్నట్లు త్వరలోనే తిరిగి తెస్తానని చెప్పాడు. అతడు చెప్పిన సమాయానికి రాకపోవడం - ఫోన్ చేసిన స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన మహిళ అతని నేపథ్యం గురించి వాకబు చేసింది. విచారణలో అతని గురించి షాకింగ్ న్యూస్ వెలుగుచూశాయి. పలు ప్రాంతాలకు చెందిన ఏడుగురి మహిళలను పెళ్లి పేరుతో ఇలాగే మోసగించినట్లు వెల్లడైంది. తాను మోసపోయినట్లుగా తెలుసుకుంది. జరిగిన మొత్తం వ్యవహారంపై బాధిత మహిళ మధురై పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలాఉండ‌గా బాష‌ ఇప్ప‌టికే ఏడుగురిని వివాహం చేసుకున్న‌ట్లు తేలింది. మ‌రోవైపు భానుకు 2011లో వివాహం జరిగింది. కానీ సంవత్సరం తర్వాత విడాకులు అవ‌డం మ‌రోమారు మోస‌పోయిన‌ట్లయింది.
Tags:    

Similar News