కరోనా భయం..యువకుడి ఆత్మహత్యాయత్నం

Update: 2020-04-19 06:38 GMT
కరోనాతో చావు భయం కళ్లముందే కదలాడుతున్న వేళ క్వారంటైన్ లో ఉన్న యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన కొమురం భీం జిల్లా కేంద్రం ఆసిఫాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం రేగింది..

కరోనా అనుమానితులను ఆసిఫాబాద్ ఆస్పత్రిలో క్వారంటైన్ లో ఉంచారు. అయితే అందులో ఉన్న ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో అదే వార్డులో ఉన్న మరో యువకుడు భయపడ్డాడు. తనను వేరో చోటికి తరలించాలని అధికారులను కోరాడు.

అయితే అధికారులు సరిగా స్పందించకపోవడంతో ఆ యువకుడు వార్డులోనే ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అధికారులు, వైద్య సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. మరో చోటికి తరలించారు.

కాగా ఆసిఫాబాద్ జిల్లాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఐదుకి చేరింది. తాజాగా ఆరేళ్ల బాలుడికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.



Tags:    

Similar News