రెండు బర్గర్ల మధ్య శాండ్ విచ్.. ఫ్రాన్స్ అల్లర్లలో ఓ వ్యక్తి పని చిత్రమైనదే..
''రెండు బర్గర్ల మధ్య శాండ్ విచ్ అయిపోయింది నా పని అంటారు''.. ఇద్దరి మధ్యన ఇరుక్కుపోయిన సందర్భంలో.. ఏమీతోచని సమయంలో.. ఎటూతేల్చుకోలేని పరిస్థితుల్లో ఇలాంటి ఉపమానాన్ని ఉపయోగిస్తుంటారు. వాస్తవానికి బర్గర్లు మందంగా ఉంటాయి.. శాండ్ వించ్ సన్నగా ఉంటుంది. వీటి మధ్యన ఇరుక్కోవడం అంటే.. శాండ్ విచ్ కు ఊపిరాడని పరిస్థితే.. ఫ్రాన్స్ అల్లర్లలోఇలానే ఓ వ్యక్తి పోలీసులు, అల్లరి మూకల మధ్య ఇరుక్కుపోయాడు. బర్గర్లలాంటి వారి మధ్య హ్యాపీగా తాపీగా శాండ్ విచ్ తింటూ గడిపాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అయింది. చూసిన వారు ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు.
ఫ్రాన్స్ ఉడుకుతోంది..
మతపరంగా ఫ్రాన్స్ కూడా కాస్త సున్నితమైనదే. గతంలో అక్కడ ఉగ్రవాదుల దాడుల జరిగాయి. పెద్దఎత్తున ప్రాణ నష్టమూ సంభవించింది. ఇక పాశ్చాత్య దేశం, ప్రగతిలో దూసుకెళ్లిన దేశం, స్వేచ్ఛ కూడా ఉంటుంది కాబట్టి ఆఫ్రికన్ దేశాల వారు భారీగా ఫ్రాన్స్ వచ్చి స్థిరపడుతుంటారు. ముఖ్యంగా అల్జీరియా వంటి దగ్గరి దేశాల వారు ఫ్రాన్స్ ను తమకు అనువైన ప్రదేశంగా భావిస్తుంటారు.
అయితే, ఇదే సమయంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ఆ దేశం ప్రభావితమైంది. తాజాగా నహేల్ అనే అల్జీరియా యువకుడు పోలీసు కాల్పుల్లో చనిపోయాడు. దీనిపై అల్లర్లు చెలరేగాయి. మంగళవారం రాత్రి పారిస్ శివారు ప్రాంతాల్లో మొదలై తర్వాత రెండు రోజుల్లోనే దేశమంతా పాకాయి. భవనాలు, వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.
ఆందోళనలో యువత సారథ్యం
ఫ్రాన్స్లో ఆందోళనలను యువతే నడిపిస్తున్నారు. పారిస్ శివారులోని క్లామర్ట్ పట్టణంలో గురువారం రాత్రి కర్ఫ్యూ విధించారు. సహేల్ వయసు 17 ఏళ్లు మాత్రమే. అలాంటి నవ యువకుడి మరణం యువతలో ఆగ్రహావేశాలు రగిలిస్తోంది. కాగా పారిస్ శివారు డిఫెన్స్ డిస్ట్రిక్ట్ వద్ద నాంటెర్రేలో గురువారం నిరసనకారులు.. పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి.
ఆందోళనకారులు సామగ్రికి నిప్పు పెట్టి.. భద్రతా దళాలపైకి గాజు సీసాలు, రాళ్లు విసిరారు. భద్రతా దళాలు ప్రతిగా ఓ భవనం వద్దకు చేరి ఆందోళనకారులను అదుపు చేసేందుకు యత్నించాయి. కాగా, ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఆ ప్రదేశం మధ్యలో రోడ్డుపై ఉన్న ఓ గట్టుపై కూర్చొని ఓ వ్యక్తి శాండ్‌విచ్ తిన్నాడు. అటు బుల్లెట్లు... ఇటు రాళ్లు దూసుకొస్తున్నా.. అతడిలో ఏమాత్రం జంకు లేదు. ఇక అడుగుల దూరంలోనే ఆందోళనకారులు నిప్పుపెట్టారు.
ఈ తతంగం మొత్తాన్ని సమీప భవనంపై నుంచి ఓ వ్యక్తి చిత్రీకరించి ఆన్‌లైన్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. కాగా, నహేల్ పై కాల్పులు జరిపిన పోలీసు అధికారి విచారణ మొదలైంది. హత్యాభియోగాలు నమోదు చేశారు. నహేల్ కుటుంబీకులకు అతడు క్షమాపణలు తెలిపాడు.
Full View
Full View Full View