తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఒక యువతికి దేశ ఆర్థిక రాజధానిలో ఎదురుకాకూడని ఒక ఘటన ఎదురైంది. 23 ఏళ్ల యువతి పార్టీకి వెళ్లి ఆటోరిక్షాలో ఇంటికి బయలుదేరింది. ఇంటికి దగ్గరగా ఉన్న ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లింది. అక్కడో వ్యక్తి తారసపడి తాను ఆటోకి డబ్బులు ఇస్తానని చెప్పాడు. దానికి ఆమె అక్కర్లేదని చెప్పింది. అయితే.. ఏటీఎం పని చేయకపోవటంతో ఆమె ఎలా అనుకుంటున్న వేళ.. ఊహించిన పరిణామం చోటు చేసుకుంది.
డబ్బులు ఇస్తానని చెప్పిన వ్యక్తి ఫ్యాంట్ జిప్ తీసి.. తన ప్రైవేట్ పార్ట్ ను చూపించాడు. దీంతో..షాక్ తిన్న ఆమె ఆగ్రహంతో తన కెమెరాతో వీడియో తీయటం స్టార్ట్ కాగానే.. అతగాడు బయటకు వెళ్లిపోయాడు. ఇలాంటి వాడిని వదిలిపెట్టకూడదని బయటకు వచ్చిన ఆమెకు పోలీసులు కనిపించారు.
వారికి విషయం చెప్పిన ఆ యువతి వద్ద వివరాలు సేకరించి.. వీడియో తీసుకున్న పోలీసులు అతడ్ని వెతికే ప్రయత్నం చేశారు. తనకు ఎదురైన చేదు అనుభవం గురించి సోషల్ మీడియాలో వివరిస్తూ.. తాను తీసిన వీడియోను పోస్ట్ చేశారా యువతి. ఏటీఎంలో తనను తాకే ప్రయత్నం చేసినట్లుగా ఆమె వెల్లడించారు.
ఏటీఎంలో కెమేరాలు ఉంటాయని తెలిసి కూడా ఇలా చేయటాన్ని ప్రస్తావిస్తూ. . ఇంతటి బరితెంపు ఎప్పటికి ఆగుతుంది? ఏటీఎంలో కెమేరాలు ఉంటాయని తెలిసి కూడా అలా చేశాడంటే ఏం చేయాలి? అని ప్రశ్నించారు. ఆమె పోస్టుకు పలువురు ఆమెకు బాసటగా నిలిచి.. జరిగిన పాడుపనిని తీవ్రంగా తప్పు పడుతున్నారు.
Full View