పశువుల వయాగ్రా మింగిన రసికుడు..ఏమైందంటే?

Update: 2020-01-16 11:30 GMT
మనుషులకు ఆ మూడ్ రావాలంటే ‘వయాగ్రా’ వాడుతారు. పశువులకు ఆ శక్తి కోసం పశువుల వయాగ్రా వాడుతారు. కానీ మనిషికి పశువుకు తేడా ఉంటుంది. ఆ తేడాను మరిచి ఓ రసికుడు పశువుల వయాగ్రాను వాడేశాడు. గోడ్డుకు మనిషికి తేడా తెలియకుండా ఓ రసికుడు ప్రవర్తించాడు.

మెక్సికో దేశంలోని వర్యాక్రూస్ ప్రాంతానికి చెందిన ఓ రసికుడు పవర్ ఫుల్ గా ఉంటుందని పశువుల వయాగ్రాను తీసుకున్నాడు. మరింత పవర్ ఫుల్ గా ఉంటుందని భావించాడు. 30ఏళ్ల మహిళతో డేటింగ్ మొదలు పెట్టిన ఆ గురుడు రెచ్చిపోదామని ఈ పని చేశాడు.

అయితే ఆ మహిళతో రెచ్చిపోయాడు.. రొచ్చు చేశాడు. అతడి అంగం మాత్రం సాధారణ స్థితికి రాకపోవడంతో కుదేలయ్యాడు. గంటలు, రోజులు గడుస్తున్నా వయాగ్రా మత్తు వదలక అంగం చిన్నబోవడం లేదట.. బయట కూడా తిరగలేని పరిస్థితి ఉండడంతోపాటు మంట పుట్టడంతో ఓ ఆసుపత్రిలో చేరాడు.

అయితే వైద్యులకు అతడిని సాధారణ స్థితికి చేర్చడం వల్ల కాలేదు. దీంతో సర్జరీ చేసి కంట్రోల్ చేశారు. దున్నపోతులకు వాడే వయాగ్రా తీసుకోవడం వల్లే ఈ అనర్థం దాపురించిందట.. దీని పవర్ రెండితలు ఉండడంతో ఈ పరిస్థితి ఎదురైందట.. ఆపరేషన్ తర్వాత అతడి అంగం పరిస్థితి ఏంటన్నది మాత్రం తెలియరాలేదు. అలా పశువుల వయాగ్రా వేసుకున్న రసికుడి పరిస్థితి ఎటూ కాకుండా పోయింది.
Tags:    

Similar News