భార్య తల నరికి చేత్తో పట్టుకుని షికార్లు

Update: 2015-10-10 10:05 GMT
కట్టుకున్న భార్యను చంపిన భర్తలను చూస్తున్నాం... నిత్యం ప్రసారమాధ్యమాల్లో ఇలాంటి వార్తలను వింటున్నాం.. చదువుతున్నాం... వారందరినీ మించిపోయాడో భర్త... భార్యను అత్యంత దారుణంగా చంపేసి ఆమె తలను చేత్తో పట్టుకుని నడివీధిలో దర్జాగా నడుచుకుంటూ వెళ్లాడా కసాయి. మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఈ అమానుష ఘటన ప్రజలను భయభ్రాంతులను చేసింది.

పుణెలోని కత్రాజ్‌ ప్రాంతానికి చెందిన రాము చవాన్‌(53) అనే వ్యక్తి తన భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అక్కడితో ఆగకుండా రక్తం కారుతున్న ఆ తలను చేత్తో పట్టుకుని వీధుల్లో తిరిగాడు. ఇది చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులకు కూడా అది చూసి భయపడిపోయారంటే చవాన్ ఎంత దారుణంగా వ్యవహరించాడో అర్థం చేసుకోవచ్చు. చివరకు పోలీసులు రాము చవాన్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. భారతి విద్యాపీఠ్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై కేసు నమోదు చేశారు.

భార్యను అత్యంత కిరాతకంగా చంపిన రాముచవాన్ వయసు 60 ఏళ్లు... వాచ్‌మేన్‌గా పనిచేస్తున్న ఈ వృద్ధుడు ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టాడన్నది పోలీసులు ఆరా తీస్తే ముసలాడి కథంతా బయటపడింది.

60 ఏళ్ల వృద్ధుడైన చవాన్ నిత్యం భార్య సోనూబాయిని అనుమానించేవాడు. హింసించేవాడు. ఇతరులతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఆమెను గొడ్డలితో నరికి దారుణంగా చంపేశాడు. ఆ వెంటనే శరీరం నుంచి తలను వేరు చేశాడు. కుడిచేతిలో గొడ్డలి... ఎడమ చేతిలో తల పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లాడు.
Tags:    

Similar News