కాపురానికి రాని భార్యను..అడ్డొచ్చిన మామను చంపాడు!

Update: 2020-06-10 23:30 GMT
మనిషిలోని మానవత్వం అంతకంతకూ కరిగిపోతుందా? పదిహేనేళ్ల పాటు కలిసి బతికిన భార్య విభేదాలతో పుట్టింటికి వెళితే.. కాపురానికి రానన్న కారణంగా చంపేసిన కసాయి భర్త ఉదంతమిది. సంచలనంగా మారిన ఈ ఉదంతాన్ని చూస్తే.. మనుషుల్లో కాఠిన్యం పెరిగిపోవటమే కాదు.. తన ఇష్టానికి భిన్నంగా జరిగితే చంపేయటమే మార్గమన్న ధోరణి కనిపించటం ఆందోళనకు గురి చేసే అంశంగా చెప్పాలి.

వికారాబాద్ జిల్లా బాలంపేటకు చెందిన 32 ఏళ్ల హజీబేగంను హైదరాబాద్ కు చెందిన కలీం పదిహేనేళ్ల క్రితం పెళ్లాడారు. వీరికి ముగ్గురు పిల్లలు. గడిచిన కొంతకాలంగా భార్య మీద అనుమానం పెంచుకున్నాడు కలీం. అదే పనిగా ఆమెతో గొడవపడేవాడు. అనుమానంతో వేధింపులకు గురి చేసేవాడు. అయినప్పటికీ భర్తతో కలిసి బతుకుబండి ఈడ్చేడి. ఈ మధ్యన అతడి వేధింపులు అంతకంతకూతీవ్రమవుతున్నాయి. భరించలేని పరిస్థితి. దీంతో.. రెండు నెలల క్రితం భర్త వేధింపులు భరించలేని ఆమె పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వచ్చింది.

రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి అత్తారింటికి వచ్చిన కలీం.. భార్యను తనతో రావాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. ఈ విషయంలో వారి మధ్య వాదులాట సాగింది. తన భార్యను పంపేందుకు సముఖంలేని మామ మీద కక్ష పెంచుకున్నాడు కలీం. తాజాగా నిద్రపోతున్న భార్యను చంపేసిన కలీం.. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన మామ గఫూర్ సాబ్ ను హతమర్చారాడు. ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.
Tags:    

Similar News