తిరుమల కొండ మీద ఏకంగా నమాజ్ చేసేశాడు

Update: 2017-01-26 05:06 GMT
తిరుమల కొండ శ్రీవారి సొంతం. అక్కడ ఆయన నామస్మరణ తప్పించి.. మరేమీ చేయకూడదు.  హిందువుల పుణ్యక్షేత్రమైన తిరుమల గిరికి నిత్యం వేలాది మంది వస్తుంటారు. ఇలాంటి చోట.. అన్యమతస్తులకు చోటు లేదు. తిరుమలలోనే కాదు.. ఏ ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అయినా.. ఆయా మతానికి పెద్దపీట వేస్తారు. మిగిలిన మతస్తులు తమ ధర్మాల్ని నిర్వర్తించుకునే వీలు ఉండదు.

అయితే.. ఇందుకు భిన్నమైన ఘటన ఒకటి తిరుమల కొండ మీద చోటు చేసుకుంది. కొండ మీద భద్రతా లోపాల్ని కళ్లకు కట్టేలాచోటు చేసుకున్న ఈ ఉదంతంలో.. శ్రీవారి దర్శనానికి వెళ్లే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 వద్ద ఒక ముస్లిం వ్యక్తి నమాజ్ చేయటం సంచలనంగా మారింది. దారుణమైన విషయం ఏమిటంటే.. భద్రతా సిబ్బంది చేష్టలుడిగి చూస్తుండటమే కానీ.. పెద్దగా పట్టించుకున్నది లేదు. చివరకు ఈ వ్యవహారం మీడియాలోకి రావటంతో.. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుంటున్నారు.

నమాజ్ చేసిన వ్యక్తిని కోల్ కతాకు చెందిన అబు హమ్జాగా గుర్తించారు. తిరుపతిలోని కొన్ని షాపులకు స్టేషనరీ వస్తువుల్ని విక్రయిస్తుంటాడని.. కొన్నేళ్లుగా ఇలా చేస్తుంటాడని చెబుతున్నారు. తొలిసారి శ్రీవారిని దర్శించుకోవటానికి తిరుమలకు వచ్చాడని.. భోజనానికి ముందు నమాజ్ చేయటం అలవాటు అని.. స్థానికంగా ఉన్న నిబంధనలు తెలీక మాత్రమే తాను అలా చేసినట్లుగా చెప్పుకున్నాడు. శ్రీవారి దర్శనానికి వెళ్లే క్యూ కాంప్లెక్స్ పక్కనే నమాజ్ చేసిన వైనం సంచలనంగా మారింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నట్లు చెప్పే అధికారులు.. మరి.. ఇలాంటివి జరగకుండా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నట్లు?
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News