రూ.149 కోట్ల బిల్లేసి షాకిచ్చిన ఓలా

Update: 2017-04-05 06:08 GMT
ముంబ‌యికి చెందిన ఒక వ్య‌క్తికి ప్ర‌ముఖ క్యాబ్ స‌ర్వీస్ సంస్థ ఓలా ఇచ్చిన షాక్ అంతాఇంతా కాదు. సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున జోకుల మీద జోకులు పేలుతున్న ఈ ఉదంతం వింటే షాక్ తినాల్సిందే. కేవ‌లం 300 మీట‌ర్ల దూరానికి ఏకంగా రూ.149 కోట్ల బిల్లు చెల్లించాలంటూ మెసేజ్ పంపి.. గుండెలు అదిరిపోయే షాకిచ్చిన వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది.

ఏప్రిల్ 1న జ‌రిగిన ఈ ఘ‌ట‌న లోకి వెళితే.. ముంబ‌యికి చెందిన న‌ర్సియాన్‌.. ములుంద్ నుంచి వ‌కోలా మార్కెట్ వెళ్లేందుకు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అయితే.. అత‌డ్ని పిక‌ప్ చేసుకునేందుకు వ‌చ్చిన డ్రైవ‌ర్.. న‌ర్సియాన్ ఉన్న ప్లేస్‌ ను క‌నుక్కోలేక‌పోయాడు. దీంతో.. అత‌నే స్వ‌యంగా క్యాబ్ వ‌ద్ద‌కు వెళ్లి క్యాబ్ ఎక్కాడు. అయితే.. క్యాబ్ 300 మీట‌ర్ల దూరం వెళ్లాక డ్రైవ‌ర్ కారు ఆపేశాడు. గ‌మ్య‌స్థానానికి తీసుకెళ్లేందుకు ఒప్పుకోలేదు. దీంతో.. మ‌రోక్యాబ్ ను బుక్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. రూ.1,49,10,51,648 (సింఫుల్‌ గా రూ.149.10కోట్లు) చెల్లించాల‌న్న మెసేజ్ వ‌చ్చింది. ఆ భారీ మొత్తాన్ని చూసి క‌ళ్లు తిరిగినంత ప‌నైంది.

బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లించ‌నందున క్యాబ్ బుక్ చేసుకోలేక‌పోతున్న‌ట్లుగా పేర్కొంది. అదే సమ‌యంలో న‌ర్సియాన్ యాప్ అకౌంట్లో ఉన్న రూ.127 ను డిడెక్ట్  చేసేసింది. దీంతో.. ఓలా క‌స్ట‌మ‌ర్ కేర్‌ కు ఫోన్ చేసి త‌న స‌మ‌స్య‌ను వివరించ‌గా.. సాంకేతిక స‌మ‌స్య కార‌ణంగా ఇలా జ‌రిగి ఉంటుంద‌ని.. ఇష్యూను ప‌రిష్క‌రిస్తామ‌ని ఓలా పేర్కొంది. త‌న‌కొచ్చిన రూ.149కోట్ల బిల్లును సోష‌ల్ మీడియాలో బాధితుడు షేర్ చేయ‌గా.. ఇప్పుడ‌ది వైర‌ల్ గా మారి.. పిచ్చ కామెడీ అయ్యింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News