చిన్న చిన్నకారణాలకే విచక్షణ కోల్పోతున్న తీరు ఆందోళన కలిగిస్తుందని చెప్పక తప్పదు. తాజాగా అలాంటి ఉదంతమే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఇంటర్నెట్ లో పోర్న్ చిత్రాలు చూస్తున్న భర్త తీరుకు విసిగిపోయిన భార్య.. నోటితో చెప్పి.. చెప్పి ఎంతకూ వినకపోవటంతో వైఫై ను ఆపేసింది. అంతే.. అప్పటివరకూ మామూలుగా ఉన్న భర్తలోని రాక్షసుడ్ని చూసిందా భార్య. భర్త కోపానికి బలైపోయింది. ఈ ఉదంతం ఎక్కడ జరిగిందంటే..
ప్రపంచమంతా మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న రోజునే హైదరాబాద్ కు చెందిన ఒక రాక్షసుడు లాంటి భర్త కారణంగా అతని భార్య నరకం అంటే చవిచూసింది.
డ్రైవర్ గా పని చేసే 30 ఏళ్ల ఉమర్ పాషాకు గతంలో రేష్మా సుల్తానా అనే మహిళతో వివాహం జరిగింది. వారిద్దరు దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖైజర్ నగర్ లో ఉంటున్నారు. బుదవారం అర్థరాత్రి ఇంటికి వచ్చిన ఉమర్.. మొబైల్ లో పోర్న్ మూవీస్ చూస్తున్నారు. అలా చూడొద్దని రేష్మా కోరింది. అయినప్పటికీ తన మాట వినని భర్త తీరుపై విసిగిపోయిన ఆమె.. వైఫైను నిలిపివేసింది.
అంతే.. విచక్షణ కోల్పోయిన ఉమర్ భార్యపై దాడికి పాల్పడ్డాడు. ఆమె ఛాతీపై పిడిగుద్దులు గుద్దటమేకాదు..సున్నిత ప్రదేశాల్లో కర్రతో తీవ్రంగా గాయపర్చినట్లుగా చెబుతున్నారు. అతడి దాడికి స్పృహ తప్పి పడిపోయిన రేష్మాను వాహనంలో ఎక్కించుకొని.. ఆమెపుట్టింటి దగ్గర పడేసి వెళ్లిపోయిన తీరును పలువురు తప్పు పడుతున్నారు.
కూతురి పరిస్థితి చూసి ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే.. అక్కడి వారుస్పందించకపోవటంతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. తన భర్త తనను విపరీతంగా వేధిస్తున్నాడన్న విషయంతో పాటు.. ఎనిమిది నెలల క్రితం తాను జన్మనిచ్చిన పాపను తనకు తెలీకుండా ఎవరికో ఇచ్చేసినట్లుగా ఆమె వెల్లడించింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.