చిలిపి ఆలోచనలు రావటం తప్పు కాదు. కానీ.. దాని వల్ల ఎలాంటి విపరిణామాలు చోటు చేసుకుంటాయన్న విషయాన్ని చెక్ చేసుకోవాలి. అంతేకాదు.. మూడొచ్చిందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎన్ని తిప్పలో బ్రిటన్ కు చెందిన ఓ వ్యక్తి ఉదంతం ఇప్పుడు వార్తగా మారింది.
బ్రిటన్ కు చెందిన డేనియల్ మెడ్ ఫోర్త్ కి 36 ఏళ్లు. పెళ్లి అయి ఇద్దరు పిల్లలున్నారు. అప్పుడప్పడు ఎక్స్ ట్రా సంతోషం కోసం వయాగ్రా వాడేస్తుంటాడు. ఇంట్లో భార్య కాకుండా.. చిన్న సెటప్ కూడా సెట్ చేసేసుకున్నాడు. ఇంట్లో ఇల్లాల్ని ఉంచేసి.. వీధిలో ప్రియురాల్ని సెటప్ చేసుకున్నాడు. ఓ సెలవు రోజున ప్రియురాలు దగ్గరకు వెళ్లి ఎంజాయ్ చేయాలని ఫీలయ్యాడు. ఫుల్ గా మందుకొట్టేసిన ఇతగాడికి ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది. వయాగ్రా బిళ్లల్ని ఓ 35 వేసుకుంటే ఏమవుతుందో చూద్దామనిపించి.. వెనుకా ముందు చూసుకోకుండా వరుసగా ఒకదాని తర్వాత మరొకటి చొప్పున వేసేసుకున్నాడు.
ఇన్ని బిళ్లలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే.. లోపలికెళ్లిన వయాగ్రా మాత్రం ఊరుకుంటుందా? పని చేయటం మొదలు పెట్టింది. మొదట కళ్లు తిరగటం.. తర్వాత రకరకాల భ్రాంతులు మొదలై.. చివరకు అంగ స్తంభన జరిగింది. అయితే.. ఎంతసేపటికి పోని పరిస్థితి. ఏదో వస్తుందనుకుంటే మరేదో రాకపోవటంతో అతగాడు చాలాసేపు ట్రై చేశాడు. ఎంత చేసినా.. అంగం మాత్రం మామూలు పొజిషన్లోకి రాని పరిస్థితి. దీంతో.. ఒక్కసారి కంగారెక్కి.. ఇంట్లో ఉన్న పెళ్లాం గుర్తుకొచ్చి.. ఆమె దగ్గరకు పరుగులు తీశాడు.
మొగుడి వ్యవహారంతో ఆమె మండిపడినా.. అతగాడి బాధను చూసి తట్టుకోలేక.. అలకను పక్కన పెట్టి అర్జెంటుగా ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ డేనియల్ సీన్ తెలుసుకొని డాక్టర్లు నోరు వెళ్లబెట్టారు. అంత సీరియస్ సీన్లోనూ డాక్టర్లు ముసిముసిగా నవ్వుకున్నారట. ఇతగాడికి వైద్యం మొదలు పెట్టిన ఐదు రోజులకు కానీ అంగస్తంభనను తగ్గించలేకపోయారట. తనకు చికిత్స చేసే డాక్టర్లు నవ్వుకోవటం చూసి డేనియల్ ఉడికిపోయాడట. అంతకు మించి ఏం చేయగలడు చెప్పండి?
ఇంత బాధలో అతగాడికి రిలీఫ్ ఏమైనా ఉందంటే.. అది భార్య విషయంలోనే నంట. తానంత తప్పుడు పని చేసినా.. నిండు మనసుతో తనను క్షమించేసిందంటూ భార్యను పొగిడేస్తున్నాడు. ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా డానియల్ కు మూడు డజన్ల వయాగ్రా ప్రభావం వెంటాడిందంట. ఏ చిన్న రాపిడి తగిలినా.. అంగస్తంభన జరిగిపోవటం.. కాసేపు ఉండిపోవటం అతనికి చికాకు పుట్టిస్తోందట. ఇలాంటి చిత్రవిచిత్రమైన పరిస్థితులు ఎదురయ్యాక.. పరిస్థితులు నార్మల్ కు వస్తాయని చెబుతున్నారు. వయాగ్రాను మోతాదుకు మించి తీసుకున్నప్పుడు ఇలాంటి అంగస్తంభన చోటు చేసుకుంటుందని.. ఆ సమయంలో తక్షణమే స్పందించకుంటే.. అంగం శాశ్వితంగా చెడిపోయే ప్రమాదం కూడా ఉందట. కాస్తంత ఎక్కువ సుఖం కోసం ఇన్ని తిప్పలు అవసరమా..?