బాబు పుష్కర స్నానాన్ని షూట్ చేశారా?

Update: 2015-07-15 07:17 GMT
రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట అంశానికి సంబంధించి మరో ఆసక్తికరమైన వాదన వినిపిస్తోంది. 27 మంది మరణించిన ఈ ఘోరానికి చంద్రబాబు కూడా కారణం అన్న వాదనకు బలం చేకూరేలా టీఆర్ ఎస్ నేత.. మాజీ ఎంపీ మందా జగన్నాధం చేస్తున్న వ్యాఖ్యలు ఉన్నాయి.

ఈ ఆరోపణల్లో నిజం పాళ్లు ఎంతన్న దానిపై పక్కా సమాచారం లేనప్పటికీ.. ఆయన చేస్తున్న ఆరోపణలు మాత్రం చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టేవారికి సరికొత్త అస్త్రం ఇస్తాయనటంలో సందేహం లేదని చెబుతున్నారు. ఇంతకీ మందా జగన్నాధం చెబుతున్న మాటేమిటంటే.. గోదావరి పుష్కరాల సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కర స్నానం చేసే సమయంలో.. షూటింగ్ నిర్వహించారని.. పుష్కరాల్ని ఘనంగా నిర్వహించటం ఖాయమన్న ధీమాతో ముందస్తుగా.. ఆయన స్నానం చేయించటాన్ని షూటింగ్ చేసి.. తర్వాత ప్రచారం కోసం వాడుకోవాలని భావించారని అందుకు ఏర్పాట్లు చేయటంతో.. ఆలస్యమైందని చెబుతున్నారు.

లుక్ బాగోవటం కోసం.. సీన్ బాగా వచ్చేందుకే వీఐపీ ఘాట్ లో కాకుండా.. మామూలు ఘాట్ లో చంద్రబాబు స్నానం చేశారని చెబుతున్నారు. ఈ షూటింగ్ కారణంగానే ఆలస్యమైందని.. రద్దీ పెరిగి.. తొక్కిసలాటకు కారణమై.. 27 మంది మరణానికి కారణమైందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తొక్కిసలాటలో భారీగా భక్తులు మృత్యువాత పడిన నేపథ్యంలో.. బాబు తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్న మాటను మందా చెప్పటం గమనార్హం. పదవికి రాజీనామా చెప్పటం రాజకీయ ప్రత్యర్థులు మామూలే. కానీ.. పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెబుతూనే.. ఎంతగా ఇమేజ్ డ్యామేజ్ చేయాలో అంతగా చేయటం గమనార్హం.
Tags:    

Similar News