ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన రావెల కిషోర్ బాబును అమాత్య పదవి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు ఊడబీకేశారు? మరో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విషయంలో కారణం చెప్పిన సీఎం చంద్రబాబు రావెల విషయంలో కనీసం కారణం కూడా చెప్పకపోవడంలో మర్మం ఏంటి? ఈ సందేహాలకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆసక్తికరమైన లాజిక్ చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీఓ నంబర్ 25ను మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తను బాధ్యత వహిస్తున్న సాంఘిక సంక్షేమ శాఖలో అమలు చేయడం వల్లే మంత్రివర్గం నుంచి తొలగించారని మంద కృష్ణ ఆరోపించారు.
మాదిగలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు గత 20 ఏళ్లుగా వారిని దారుణంగా మోసం చేశారని మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఎస్సీ కులాలకు ఉపయోగపడే మూడు శాఖలను ఎస్సీ కులంలోని మాలలకే కేటాయించిన చంద్రబాబు రానున్న కాలంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మంగళగిరిలోని జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు వ్యతిరేకంగా తమ కార్యాచరణ మొదలుపెట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో జూలై 7న మాదిగల కురుక్షేత్ర మహాసభ నిర్వహిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్ర నలుమూలల నుంచి పది లక్షల మంది హాజరవుతారని మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు. ఈ సభ సాక్షిగా తమ సత్తా చాటుతామని తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/