ఏపీ సర్కారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ తన దూకుడు పెంచారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడం కోసం పోరాటానికి సిద్ధమైన మందకృష్ణ ఈ క్రమంలో వివిధ పార్టీల మద్దతును కూడగడుతున్నారు. అయితే గతంలో హామీ ఇచ్చినప్పటికీ వర్గీకరణకు మద్దతు ఇచ్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు రాకపోవడంతో మందకృష్ణ నిరసన బాట పట్టారు. తన సత్తా చాటేందుకు జూలై 7న అమరావతిలో జరగనున్న మాదిగల కురుక్షేత్ర మహాసభకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో తాజాగా బాబు తమ పోరాటానికి మద్దతిచ్చేలా వినూత్న ప్రయత్నం చేస్తున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించిన మందకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత నిమిత్తం తాము తీర్థయాత్రలు చేస్తూ దేవుళ్లూ - దేవతలకు మొక్కుకుంటున్నట్టు చెప్పారు. తిరుమల నుండి ప్రారంభమైన తన యాత్ర విజయవాడ మీదుగా చిన వెంకన్న క్షేత్రానికి చేరినట్టు చెప్పారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించడంతో పాటు రాజ్యాంగ విరుద్ధమైన పాలన సాగిస్తూ పౌర స్వేచ్ఛను హరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కనువిప్పు కలిగించాలని చిన వెంకన్నను వేడుకున్నట్టు మందకృష్ణ తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం చట్ట వ్యతిరేక పాలన సాగిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణాలో తమ సహకారంతోనే చంద్రబాబు పాదయాత్ర చేశారని, తాము ఇక్కడ పాదయాత్ర చేస్తే అప్రజాస్వామికంగా అరెస్టు చేస్తున్నారని మందకృష్ణ మండిపడ్డారు.
2014లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో దళితుల్లో మాదిగల సహకారంతోనే చంద్రబాబు గెలుపొందారని మందకృష్ణ గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు హామీ ఇవ్వడం వల్లే తామంతా ఆ పార్టీకి మద్దతు తెలిపినట్టు చెప్పారు. కానీ ఇప్పుడు మాట తప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్ కల్పిస్తామని నమ్మించడం వల్లే పవన్ కల్యాణ్‌తోపాటు పలువురు కాపు నేతలు చంద్రబాబుకు మద్దతు తెలిపారన్నారు. అయితే ఇచ్చిన మాట తప్పడంతోపాటు కాపు ఉద్యమ నేత ముద్రగడ తలపెట్టిన పాదయాత్రను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను తాను మాత్రం అనుభవిస్తూ మిగిలిన వారిని అణగదొక్కడం ఏమి న్యాయమని బాబును సూటిగా శ్నించారు. పోరాటమే శరణ్యమని భావించి జూలై 7న అమరావతిలో మాదిగల కురుక్షేత్ర మహాసభ ఏర్పాటుచేసినట్లు మందకృష్ణ వివరించారు. ఈ సభ విజయవంతం అయ్యేందుకు తనకు శక్తి, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని స్వామి వారిని వేడుకున్నట్టు చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/