ఎస్సీ వర్గీకరణ వ్యవహారం తెలంగాణలో సరికొత్త అగ్గి పుట్టేలా కనిపిస్తోంది. ఎస్సీవర్గీకరణపై రణం గత కొన్నేళ్లుగా సాగుతున్న సంగతి తెలిసిందే. మాలలు.. మాదిగల మధ్య సాగుతున్న ఈ పోరును ఒక కొలిక్కి తెచ్చేందుకు ముఖ్యనేతలతో సహా ఉద్యమ నేతలు ఎవరూ ముందుకు రాకపోవటం..ఈ అంశాన్ని పరిష్కరించే కన్నా.. చూసీచూడనట్లుగా వదిలేయాన్న ధోరణి కనిపిస్తుందని చెప్పాలి.
ఎస్సీ వర్గీకరణ అంశంలో మాదిగలకు న్యాయం చేయాలంటూ ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ.. ‘మాదిగల ధర్మయద్ధ సభ’నను నిర్వహించనున్న విషయం తెలిసిందే. తాము నిర్వహించే సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వస్తున్నట్లుగా మందకృష్ణ ఇప్పటికే ప్రకటించారు. ఇలాంటి సున్నిత అంశాలకు సంబంధించిన సభలకు కేసీఆర్ లాంటి అధినేతలు వస్తారా? అన్నది ఒక ప్రశ్న అయితే.. మందకృష్ణ నిర్వహించనున్న సభపై మాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎస్సీ వర్గీకరణకు మద్దుతు పలికి.. మాలల హృదయాల్ని గాయపరిచిన ప్రజా గాయకుడు గద్దర్.. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు.. కవి.. ఉద్యమ నాయకుడిగా పేరున్న గోరేటి వెంకన్నలను మాల కులం నుంచి వెలి వేస్తున్నట్లగా ఎస్పీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు తాజాగా ప్రకటించటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో మాల కులం నుంచి ముగ్గురు ప్రముఖుల్ని వెలి వేస్తున్నట్లుగా ప్రకటించారు.
ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తున్న సీపీఐ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి.. నారాయణల భరతం పడతామని.. తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరాం నాలుక చీరేస్తామని హెచ్చరించిన వైనం ఇప్పుడ అందరి దృష్టి పడేలా చేస్తోంది. తన మాటలతో మంట పుట్టిస్తూ.. కొత్త కలకలం సృష్టిస్తున్న ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జాతీయ కన్వీనర్ చెన్నయ్య మాటలు ఇప్పుడు అగ్గి పుట్టిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/