ఈ స‌భ‌లో ఎమ్మెల్యే గా సిగ్గుప‌డుతున్నా.. ప‌ద‌వికి సీనియ‌ర్ గుడ్‌ బై

Update: 2018-12-25 08:06 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటుచేస‌కుంది. బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీమంత్రి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న ప‌ద‌వికి గుడ్ బై చెప్పిన అనంత‌రం ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో  మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నియోజవర్గానికి స్వయంగా ఇచ్చిన 56 హామీలు అమలు విషయంలో విఫలమయ్యరు. దీని పై మనస్థాపం చెందే ఈ నిర్ణయానికి వచ్చాన‌ని పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు విషయంలో పూర్తిగా విఫలమయ్యారని, ఆయ‌న ఇచ్చిన హామీలు 56 జీవోలు ఇచ్చి కార్యరూపం దాల్చకపోవడం కక్ష సాదింపేన‌ని మాణిక్యాలరావు స్ప‌ష్టం చేశారు.

``ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు గారు నేను ఈ నియోజకవర్గంలో మీ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు కాబట్టి నాపై, నా నియోజకవర్గ ప్రజల పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. ఈ నియోజకవర్గానికి చెందిన సమస్యలు విషయంలో గత మూడు నెలలుగా మీ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదు. ఇక్కడి స్థానిక తెలుగుదేశం నేతలు ఒత్తిడి కారణంగానే ఈ నియోజకవర్గ పనులు ఉద్దేశపూర్వకంగా నిలుపదల చేశారు

మీరు ఈ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలకు సంబంధించిన వివరాలతో కూడిన పత్రాన్ని మీకు పంపిస్తున్నా, 15రోజుల్లో వాటిని అమలుచేయని పక్షంలో నిరవధిక నిరాహారదీక్షకు దిగుతా`` అంటూ పైడికొండల మాణిక్యాల రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ``ఇటువంటి శాసనసభలో సభ్యుడిగా ఉండేందుకు నాకు సిగ్గుగా ఉంది. మీరు ఈ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు అమలుచేయని పక్షంలో నేను మీకు పంపిన రాజీనామా లేఖను స్పీకర్‌ కు పంపి మీరే ఆమోదం చేయించండి`` అని పైడికొండల స్ప‌ష్టం చేశారు.
Tags:    

Similar News