ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మరోమారు పార్లమెంటులో కీలక చర్చ సాగింది. పెద్దల సభ అయిన రాజ్యసభలో పలు పార్టీల నేతలు గళం విప్పారు. ఆయా పార్టీల ముఖ్యనేతలు తమ తమ పార్టీల తరఫున ఏపీ ప్రయోజనాల కోసం స్పందించారు. విభజన హామీలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా రాజ్యసభలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాడు ప్రధాని హోదాలో తాను హామీ ఇచ్చానని అన్నారు. తమ తర్వాత వచ్చిన ప్రభుత్వం హోదా హామీని అమలు చేయలేదని - నాడు పార్లమెంట్ లో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన ప్రజలకు ఇచ్చిన హమీలు నెరవేర్చకుండా పోవడం అనేది సబబు కాదన్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత - ఉమ్మడి రాష్ట్రంలో ఇంచార్జీగా వ్యవహరించిన రాజ్యసభ సభ్యుడు గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. ఏపీ ప్రజల మనోభావాలు నాకు తెలుసని రాజ్యసభలో ప్రస్తావించిన ఆజాద్... రాజకీయ నేతగా ఏపీతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు.రాష్ట్ర విభజన చరిత్ర తెలిస్తేనే ఏపీ సమస్యలేంటో తెలుస్తాయన్న ఆయన... తెలంగాణకున్న అవకాశాలు ఏపీకి లేవని - ప్రత్యేక తెలంగాణ కోరుకోవడం ఎంత సమంజసమో అలాగే ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా కోరుకోవడం అంతే సమంజసమన్నారు. ఏపీ ప్రజల పట్ల సానుభూతితో వ్యవహరించాలని సూచించిన ఆజాద్... విభజన వల్ల తెలంగాణకు వనరులు దక్కాయి... ఏపీని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న విషయాన్ని గుర్తు చేసిన ఆజాద్... ప్యాకేజీ కింద రూ. 16 వేల కోట్లు ఇస్తామని చెప్పి కేవలం రూ. 400 కోట్లే ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి దేవాలయమైన పార్లమెంటులో చేసిన చట్టాలను అమలు చేయకపోవడం దారుణమని అన్నారు. చట్టాలను నీరుగారుస్తూ పార్లమెంటు వ్యవస్థపై నమ్మకం పోయేలా ఎన్డీయే ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. నాలుగేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం - ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హానీమూన్ చేసుకున్నాయని... కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న ప్యాకేజీకి పొంగిపోయిన రాష్ట్ర ప్రభుత్వం... సన్మానాలు చేసిందని - శాసనసభలో తీర్మానాలు కూడా చేసిందని ఎద్దేవా చేశారు. చేసిన చట్టాలను అమలు చేయకపోతే పార్లమెంటు వ్యవస్థ - ప్రజాప్రతినిధులపై ప్రజలకు గౌరవం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఏపీ ప్రజలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని... విభజన సమయంలో అప్పటి అధికారపక్షం, ప్రతిపక్షం అంగీకరించిన హామీలను మాత్రమే నెరవేర్చాలని కోరుతున్నారని కేవీపీ అన్నారు. తాము అధికారంలోకి రాగానే అన్ని హామీలను నెరవేరుస్తామంటూ ఎన్నికల సమయంలో ఏపీ ప్రజలను మోదీ నమ్మించారని... అధికారంలోకి రాగానే అన్నీ మర్చిపోయారని అన్నారు. రాష్ట్ర హక్కుల కోసం పలు వేదికలపై కాంగ్రెస్ పార్టీ పలు డిమాండ్లు చేసినప్పటికీ - కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. వైసీపీ ఎంపీలకు మోదీ అపాయింట్ మెంట్ ఇస్తున్నారన్న కారణంగానే ఎన్డీయే నుంచి వారు బయటకు వచ్చారని కేవీపీ అన్నారు
సీపీఎం ఎంపీ రంగరాజన్ మాట్లాడుతు..టీడీపీని బీజేపీ నాలుగేళ్లపాటు వాడుకుని వదిలేసిందని విమర్శించారు. 5 కోట్ల ఆంధ్రులకు న్యాయం చేయని బీజేపీ ప్రభుత్వం దేశంలోని 120 కోట్ల మంది ప్రజలకు న్యాయం చేస్తారా? అని ఎద్దేవా చేశారు. చెన్నైలో 29 శాతం మంది తెలుగువారున్నారనీ..ఏపీ కష్టాలు తమకు తెలుసన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ ప్రజల సమస్యలు - కష్టాలు తమకు తెలుసన్నారు. ఏపీ ప్రత్యేక హోదా అంశం ఏ ఒక్క రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదన్నారు.
కాగా, ఏపీ విభజన విషయంలో రాజ్యసభలో కొనసాగుతున్న చర్చ సందర్భంగా విపక్ష ఎంపీలకు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ సమాధానం చెబుతు..గత ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసే విషయంలో కట్టుబడి ఉన్నామన్నారు. ఏ పార్టీ అధికారంలో వున్నా ప్రధాని ప్రధానేనని పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి వున్నామని తెలిపారు. ఇప్పటికే 90శాతం హామీలను అమలు చేశామని..మిగిలినవి కూడా అమలు చేస్తామని రాజ్ నాథ్ తెలిపారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో వున్నారా అనే విషయం తమకు ముఖ్యంగాకాదనీ...ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. విద్యాసంస్థల విషయంలో పక్షపాత ధోరణి అనేది లేదన్నారు. బయ్యారం - కడప స్టీల్ ప్లాంట్స్ - విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కమిటీలు అధ్యయనం చేస్తున్నాయని తెలిపారు. ఏపీ - తెలంగాణల్లో స్టీల్ ప్లాంట్స్ పై కమిటీలు వ్యతిరేక నివేదికలు ఇచ్చినా మేం మాత్రం వాటి ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నామని రాజ్ నాథ్ తెలిపారు. రైల్వే జోన్ పై చర్చలు కొనసాగుతున్నాయని..రైల్వే జోన్ కచ్చితంగా వస్తుందని కేంద్రమంత్రి రాజ్ నాథ్ హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనంచేశామని గుర్తు చేశారు.