తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసాఈర్ పరిపాలనకు అనూహ్య కితాబు దక్కింది. కాంగ్రెస్ సీనియర్ నేత - మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గులాబీ దళపతి సర్కారుపై ప్రశంసలు గుప్పించారు. దేశంలోనే పిన్న రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని కితాబిచ్చారు. దేశంలోనే అత్యుత్తమ పాలన అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అంటూ మన్మోహన్ సింగ్ కొనియాడారు.కొత్తగా ఎంపికైన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ - బండ ప్రకాష్ - బడుగుల లింగయ్య యాదవ్ లను పార్లమెంట్ లాబీల్లో మన్మోహన్ దగ్గరకు తీసుకెళ్లి టీఆర్ ఎస్ సీనియర్ నేత కే. కేశవరావు పరిచయం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు - సంక్షేమ కార్యక్రమాలను మన్మోహన్ కు వివరించారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీలతో మన్మోహన్ సింగ్ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన సాగుతోందని కితాబిచ్చారు. తెలంగాణలో అభివృద్ధి ఇలానే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల కనీస అవసరాలు తీర్చే పనులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలు తనకు తెలుసు కనుకే పాలన ఉత్తమంగా సాగుతోందని ప్రశంసించానని మన్మోహన్ సింగ్ అన్నారు. ఆయన ప్రశంసలకు టీఆర్ ఎస్ రాజ్యసభ సభ్యులు కృతజతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రముఖుడికి కితాబులతో గులాబీ దళంలో కొత్త జోషి వచ్చిందని అంటున్నారు.