కాంగ్రెస్ ఆఫ‌ర్...మ‌న్మోహ‌న్ తిర‌స్క‌ర‌ణ‌

Update: 2019-03-11 14:30 GMT
కాంగ్రెస్ పార్టీకి కీల‌క‌మైన ఎన్నిక‌ల ముందు ఊహించ‌ని షాక్ త‌గిలింది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్ రూపంలో త‌గిలింది. కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్ర‌తిపాద‌న‌కు ఆయ‌న నో చెప్పారు. 2019 ఎన్నిక‌ల నేప‌థ్యంలో బ‌రిలో దిగేందుకు ఆయ‌న నో చెప్పారు. పంజాబ్‌ కాంగ్రెస్‌ యూనిట్ పెట్టిన ప్ర‌తిపాద‌న‌కు ఆయ‌న నో చెప్పిన‌ట్లు స‌మాచారం.

పంజాబ్ కాంగ్రెస్ యూనిట్‌ కు మన్మోహన్‌ కు పెద్ద ఆఫరే ఇచ్చినట్లు తెలుస్తోంది. అమృత్‌ సర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌ సభకు పోటీ చేయాలని మన్మోహన్‌ కు చెప్పినప్పటికీ ఆయన సుముఖంగా లేరని సమాచారం. 86 ఏళ్ల మన్మోహన్‌ సింగ్‌...కాంగ్రెస్‌ ఆఫర్‌ ను సున్నితంగా తిరస్కరించినట్లు విశ్వసనీయ సమాచారం. 2009 సాధారణ ఎన్నికల సమయంలోనూ అనారోగ్య సమస్యల వల్ల లోక్‌ సభకు పోటీ చేయలేదు.

2014 సాధారణ ఎన్నికల్లో అమృత్‌ సర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున అమరీందర్‌ సింగ్‌ పోటీ చేసి గెలిచారు. అయితే 1991 నుంచి అసోం నుంచి మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. మన్మోహన్‌ రాజ్యసభ పదవీ కాలం ఈ ఏడాది జూన్‌ 14తో ముగియనుంది. ఇప్పటి వరకు మన్మోహన్‌ లోక్‌ సభకు ఎన్నిక కాలేదు. 1999లో కాంగ్రెస్‌ తరపున మన్మోహన్‌ సింగ్‌ దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయ‌న నో చెప్పడం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News