పాకిస్థాన్ వెళ్తానంటున్న మాజీ ప్రధాని

Update: 2019-10-03 11:28 GMT
పరిస్థితులు ఇలా ఉంటే భారత మాజీ ప్రధాని - కాంగ్రెస్ నాయకుడు మన్మోహన్ సింగ్ నవంబర్ 9న పాకిస్థాన్ వెళ్తారని వార్తలు రావడం చర్చనీయాంశం అయ్యింది. సిక్కు మత గురువు గురునానక్ 550వ జయంతి సందర్భంగా పాకిస్థాన్ లోని కర్తార్ పూర్ లో ఉన్న దర్బార్ సాహెబ్ ను మన్మోహన్ దర్శించుకుంటారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆహ్వానించడంతో మన్మోహన్ ఒప్పుకున్నారు. గురునానక్ తన జీవితంలో చివరి 20 సంవత్సరాలు అక్కడే గడిపారని పురాణాలూ చెప్తున్నాయి. అందుకే ఆ గురుద్వారాకు అంత ప్రాముఖ్యత ఇస్తారు.

భారతదేశ విభజనతో ఆ ప్రాంతం పాకిస్థాన్ లో కలిసిపోయింది. దీంతో ఆ గురుద్వార సందర్శించాలంటే భారత్ లో ఉన్న సిక్కులు చాలా కష్టపడేవారు. నవంబర్ 12న గురునానక్ జన్మదినం సందర్భంగా కర్తార్ పూర్ గురుద్వారాకు తొలివిడత భక్తులతో కలిసి మన్మోహన్ పాకిస్థాన్ వెళ్లనున్నారు. పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల మంత్రి ఖురేషి కూడా కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి మన్మోహన్ ను ఆహ్వానించామని స్పష్టం చేశారు.


Tags:    

Similar News