పారికర్ నోట న్యూడ్ డ్యాన్సులు

Update: 2016-12-20 12:15 GMT
గోవాకు సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు రక్షణ మంత్రిగా ఉన్నంత వరకు ఏనాడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయని మనోహర్ పారికర్ ఇప్పుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీడియాపై ఫైర్ అయ్యారు. ఆ క్రమంలో ఆయన... పబ్లిసిటీ కావాలంటే బట్టలుప్పేసి డ్యాన్సులు చేయండి సీరియస్ కామెంట్లు చేశారు.  
    
గోవాలోని సత్తారి సబ్‌ జిల్లాలో సోమవారం బీజేపీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన పరిక్కర్.. మీడియా తన హద్దులను గుర్తుపెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. ‘1968లో వాటర్‌ గేట్‌ కుంభకోణం సందర్భంగా ఒక ఎడిటర్‌ ….  రిచర్డ్‌ నిక్సన్‌ కే (అమెరికా అప్పటి ప్రెసిడెంట్) సలహాలు ఇస్తూ పెద్ద సంపాదకీయం రాయడం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడు అదే నిక్సన్‌ కోసం మరాఠీలో ఇప్పుడు ఎడిటోరియల్ రాస్తామంటే ఎలా” అని ప్రశ్నించారు. కొందరు మీడియా వ్యక్తులు పరిధి గుర్తించకుండా పదేపదే గోల చేస్తున్నారని విమర్శించారు. అలాంటి వారు బట్టలు విప్పేసి నగ్నంగా డ్యాన్సులు వేయాల్సిందిగా తాను సలహా ఇస్తున్నానని వ్యాఖ్యానించారు.
    
అంతేకాదు.. వెయ్యి కాపీలు కూడా అమ్ముడుపోని పత్రిక కూడా అంతర్జాతీయ స్థాయిలో సంపాదకీయాలు రాసి పబ్లిసిటీ తెచ్చుకునేందుకు వెంపర్లాడుతోందని ఒక లోకల్‌ పత్రిక పైనా ఫైర్ అయ్యారు రక్షణ మంత్రి. మీడియాపై ఆయన అగ్గిమీద గుగ్గిలమవడంతోపాటు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో మీడియా అంతా ఆయనపై మండిపడుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News