మ‌న‌దెంత ద‌రిద్ర‌పు ప‌రిస్థితో చెప్పిన పారీక‌ర్‌

Update: 2017-12-10 08:11 GMT
ఇంటికి చుట్టాలు ఎవ‌రైనా వ‌చ్చార‌నుకోండి..వాళ్ల‌కు ఏర్పాట్లు చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఒక‌ట్రెండు వ‌స్తువుల కోసం బ‌య‌ట‌కు వెళ్ల‌టం మామూలే. కానీ.. చుట్టాలు ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌తి వ‌స్తువుకూ ఇంటికి వెళ్లాల్సి వ‌చ్చే ప‌రిస్థితి దాదాపు ఏ ఇంట్లోనూ ఉండ‌దు. కానీ.. ఇప్పుడు చెప్పే ఉదంతం వింటే ర‌క్ష‌ణ రంగం విష‌యంలో మ‌న‌మెంత వీక్ గా ఉన్నామో ఇట్టే అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి.

సంచ‌ల‌నం సృస్టించ‌టమే కాదు.. అంత‌ర్జాతీయంగా మ‌న సైనిక ప‌టిమ‌ను తెలియ‌జెప్పేలా స‌ర్జిక‌ల్ స్ట్రైక్ జ‌రిగింది. నియంత్ర‌ణ రేఖ‌ను దాటి మెరుపు దాడుల్ని విజ‌య‌వంతంగా పూర్తి చేసి రావ‌టం అప్పుట్లో పెను సంచ‌ల‌నంగా మారింది. ఉగ్ర‌వాదుల్ని దేశంలోకి పంపుతూ కుట్ర ప‌న్నుతున్న పాక్‌కు దిమ్మ తిరిగే షాకిచ్చింది. భార‌త్ జ‌రిపిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్ అంత‌ర్జాతీయంగా హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు.. సైనిక వ్య‌వ‌హారాల విష‌యంలో భార‌త్ ప్ర‌ద‌ర్శించిన దూకుడు ఇంటా బ‌య‌టా మ‌న్న‌న‌లు పొందింది.

మెరుపు దాడుల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఏ ఒక్క దేశం కూడా వ్య‌తిరేకంగా మాట్లాడ‌ని ప‌రిస్థితి. ఇంత విజ‌యం సాధించిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యం ఒక‌టి బ‌య‌ట‌పెట్టారు గోవా ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర పారిక‌ర్‌. స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ వ్యూహాం.. వాటిని నిర్వ‌హించిన తీరుకు సంబంధించిన ఆస‌క్తిక‌ర అంశాల్ని బ‌య‌ట‌పెట్టారు పారీక‌ర్‌.

దాడుల్ని నిర్వ‌హించ‌టానికి ముందు.. అందుకు అవ‌స‌ర‌మైన వ‌స్తువుల్ని కొనుగోలు చేసేందుకు  వీలుగా ఉన్న‌తాధికారులు ప‌లువురు విదేశాల‌కు వెళ్లిన‌ట్లు ప్ర‌క‌టించారు. దాడుల‌కు సంబంధించిన సామాగ్రిని చివ‌రి నిమిషంలో కొనుగోలు చేసిన‌ట్లుగా చెప్పారు. మెత్తం వ్య‌వ‌హారం సీక్రెట్‌ గా సాగింద‌ని.. కొన్ని అంశాలు ఇప్ప‌టికి బ‌య‌ట‌కు రాలేద‌న్నారు. పారీక‌ర్ మాట‌లు వింటే.. ఒక దేశం మీద స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేసేందుకు అవ‌స‌ర‌మైన ఆయుధాలు కూడా మ‌న ద‌గ్గ‌ర లేవా? అనిపించ‌క‌మాన‌దు.


Tags:    

Similar News