సంపద చాలామందికి దగ్గర ఉండొచ్చు. కానీ..అందరికి దేవసాని రామమనోహర్ రెడ్డికి ఉన్నంత గొప్ప మనసు కచ్ఛితంగా ఉండదు. ఇప్పుడున్న కాలంలో వందల కోట్ల ఆస్తి ఉన్నా.. మరింత సంపాదించేందుకు అడ్డదిడ్డంగా వ్యవహరించటం.. అడ్డమైన దారుల్ని వెతకటం లాంటివి చూస్తున్నాం. ఎంత సంపాదించినా తీరని ధన దాహంతో దేనికైనా సిద్దమన్నట్లుగా వ్యవహరించేటోళ్లను చూస్తుంటాం. కానీ.. తనకున్న దానిని నలుగురికి ఉపయోగపడేలా దానం చేసే గొప్ప మనసు చాలా కొద్దిమందిలోనే ఉంటుంది. శ్రీమంతుడు సినిమాలో హీరో మైండ్ సెట్ కు దగ్గరగా ఉండే రియల్ మనిషిగా ప్రకాశం జిల్లాకు చెందిన దేవసాని రామమనోహర్ రెడ్డిని చెప్పాలి.
ఇంతకూ ఆయనేం చేశారు? అంతలా పొగిడేస్తున్నారన్న భావన మీకు రావొచ్చు. కానీ.. పూర్తిగా చదివితే ‘వావ్’ అన్న మాట మీ నోటి నుంచి రాకుండా మానదు. ఆయనేం చేశారన్న విషయంలోకి వెళితే.. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడుకు చెందిన రామ మనోహర్ రెడ్డి తాజాగా తనకున్న భూమిలో నాలుగు ఎకరాల్ని పేదలకు పంచి పెట్టారు. తమ గ్రామానికి చెందిన 150 మంది పేదలకు ఒక్కొక్కరికి 107 చదరపు గజాల ఇళ్ల స్థలాన్ని కేటాయిస్తూ ఆయన పత్రాల్ని సిద్ధం చేయించారు.తాను ఎంపిక చేసిన 150 మందితో పాటు గ్రామ పెద్దల్ని పిలిచి.. వారి సమక్షంలో వారికి దానపత్రాల్ని అందజేశారు.
అంతేకాదు.. వచ్చే ఏడాది జనవరి 18న మరో మూడు ఎకరాల్లో 100 మందికి ఇళ్ల స్థలాల కోసం దానపత్రాల్ని సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముప్ఫై ఏళ్ల క్రితం ఊరును వదిలేసి బెంగళూరుకు వెళ్లిన ఆయన.. ఇప్పుడు అక్కడే స్థిరపడ్డారు. అయితే.. తాను పెరిగిన ఊరును మర్చిపోకుండా అప్పుడప్పడు ఊరికి వస్తుంటారు. ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా అండగా నిలిచే ఆయన ఊరి వారికి సుపరిచితుడు. తాజాగా మాత్రం పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు వీలుగా భూమిని దానం చేసిన వైనం అందరిని ఆకర్షిస్తోంది. ఏమైనా ఇలాంటోళ్లు అరుదనే చెప్పాలి. అందుకే.. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నోళ్లు పెరిగే కొద్దీ.. మన చుట్టూ ఉన్న సమాజం.. ప్రజలు అంతో ఇంతో ఎదగటం ఖాయమని చెప్పక తప్పదు.