ఏపీలో ప్రచారానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడంతో వివిధ పార్టీల అధినేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీతోపాటు జనసేన కూడా ప్రచారంలో జోరు పెంచింది. పవన్ సభలకు జనం పోటెత్తుతున్నారు.
తాజాగా విశాఖపట్నంలో నిర్వహించిన పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు జనం పెద్ద ఎత్తున తరలిరావడంతో సభలో అపశృతి చోటుచేసుకుంది. గురువారం నగరంలోని 80 ఫీట్ రోడ్డులో జరిగిన సభకు పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం చేరుకున్నారు. పవన్ కళ్యాన్ రాకతో ఒక్కసారిగా అక్కడి ప్రాంతమంతా మారుమోగిపోయింది. పవన్ కళ్యాన్ కు స్వాగతం పలుకుతూ అరుపులు , కేకలతో హోరెత్తించారు. పవన్ ను చూడడానికి యువత, మహిళలు ఒక్కసారిగా ఎగబడడంతో తోపులాట జరిగింది. మైకులు పెట్టే బాక్స్ స్టాండ్ పైకి ఎక్కి మరి పవన్ ను చూసేందుకు ప్రయత్నించగా ఆ స్టాండ్ కూలిపోయింది. దీంతో దానిపై ఎక్కిన వారు కింద ఉన్న వారిపై బాక్సులు పడ్డాయి. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ మీడియా సంస్థ ఫొటోగ్రాఫర్ కాలు కూడా విరిగిపోయింది. ఎక్కువమంది అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
పవన్ కు తెలుగునాట ఉన్న క్రేజ్ అంతా ఇంతకాదు.. పవన్ వస్తున్నాడంటే చాలు అభిమానులు ఎగబడుతున్నారు. పవన్ పై ఆసక్తితో వస్తున్న వారు గోడల మీద, చెట్ల మీద, సౌండ్ బాక్సులు పెట్టే స్టాండ్ కింద కూర్చొని ప్రమాదాల బారిన పడుతున్నారు.ఇలా తరచూ పవన్ సభల్లోనే అపశృతులు చోటుచేసుకోవడం ఆ పార్టీని కలవరపెడుతోంది.