మృత్యుముఖంలో కూడా ఆ జర్నలిస్ట్ మనసు వృత్తికే అంకితమైంది. చావు అంచుల్లోనూ తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ తన విధులు నిర్వర్తించాడు. మావోయిస్టులు తమను చుట్టుముట్టి చంపేస్తున్న పరిస్థితుల్లోనూ రిపోర్ట్ చేసిన దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానంద్ చివరి వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.
చత్తీస్ ఘడ్ లోని దంతెవాడ ఆరాన్ పూర్ లో మంగళవారం మావోయిస్టులు జరిపిన మెరుపుదాడిలో దూరదర్శన్ కెమెరామెన్ అచ్చుతానంద్ మరణించిన సంగతి తెలిసిందే. అయితే మావోయిస్టులు హతమార్చే ముందు అక్కడి పరిస్థితులపై సెల్ఫీ వీడియో తీసుకొని అచ్చుతానంద్ చివరి మాటలు మాట్లాడాడు. తన మాతృమూర్తికి కన్నీటి వీడ్కోలు చెబుతూ వీడియో రికార్డ్ చేశారు.
అతడు మరణించాక తాజాగా బుధవారం ఆ వీడియో బయటకు వచ్చింది. వీడియోలో వృత్తి పట్ల ఆయన నిబద్ధత - కన్నతల్లిపై ఉన్న ప్రేమ - అప్యాయత మన కళ్లకు కడుతోంది. ఎదురుగా చావు తరుముకొస్తున్నా భయం లేకుండా కెమెరామెన్ అచ్యుతానంద్ చెబుతున్న ఆఖరి మాటలు ఆయనలోని ధైర్యాన్ని చాటి చెబుతున్నాయి.
దంతెవాడలోని ఎన్నికల ప్రచారాన్ని కవర్ చేసేందుకు దూరదర్శన్ మీడియా బృందం మంగళవారం అక్కడికి వెళ్లింది. అదే సమయంలో మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కెమెరామెన్ అచ్చుతానంద్ తోపాటు ఇద్దరు భద్రతా సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అచ్చుతానంద్ చనిపోతూ తీసుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Full View