కిడారిని..సివేరిల‌ను అందుకే చంపామ‌న్న మావోలు

Update: 2018-10-10 04:10 GMT
ఏపీ అధికార‌ప‌క్ష ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్యేల‌ను మావోలు హ‌త‌మార్చిన వైనం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. దేశ వ్యాప్తంగానూ పెద్ద చ‌ర్చ‌కు తెర తీసింది. ఉనికిని.. ప‌ట్టును అంత‌కంత‌కూ కోల్పోతున్న మావోలు ఇంత తీవ్ర చ‌ర్య‌కు దిగ‌టం పెద్ద చ‌ర్చ‌కు తెర తీసింది. మావోల వైఖ‌రిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మవుతున్న వేళ‌.. మావోల నుంచి ఒక బ‌హిరంగ లేఖ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ప‌లు మీడియా సంస్థ‌ల ఎడిట‌ర్ల‌ను ఉద్దేశించి తాజా లేఖ‌ను విడుద‌ల చేయ‌టం క‌నిపించింది. ఇందులో తాము కిడారిని.. స‌వేరిని ఎందుకు హ‌త‌మార్చామన్న విష‌యాన్ని వెల్ల‌డించ‌టం గ‌మ‌నార్హం. గ‌త నెల 23న ఎమ్మెల్యే కిడారి.. మాజీ ఎమ్మెల్యే సివేరిల‌నుఏ ప‌రిస్థితుల్లో కాల్చి చంపింది తాజా లేఖ‌లో పేర్కొన్నారు.

గిరిజ‌న్నుల్ని మోసం చేసి సొంత లాభం కోసం కోట్ల‌కు అమ్ముడుపోయినందునే కిడారిని హ‌త‌మార్చింద‌ని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ సెంట్ర‌ల్ క‌మిటీ పేరిట ఈ లేఖ‌ను విడుద‌ల  చేశారు. ఇందులో గిరిజ‌న వ్య‌తిరేకులు.. ప్ర‌జా ద్రోహులైన కిడారి.. సివేరిల‌ను తాము ప్ర‌జాకోర్టులో క‌ఠినంగా శిక్షించిన‌ట్లుగా పేర్కొన్నారు. ప్ర‌జా ద్రోహులైన ఇద్ద‌రు నేత‌ల్ని ప్ర‌జా కోర్టులో పెట్టి.. వారి నోటి నుంచి వారు చేసిన త‌ప్పులు ఒప్పుకున్నాకే.. వారికి శిక్ష‌లు అమ‌లు చేసిన‌ట్లుగా చెప్పారు.  

గూడ క్వారీ విష‌యంలో తాము ఎన్నోసార్లు హెచ్చ‌రించామ‌ని.. అయిన‌ప్ప‌టికీ అధికార పార్టీకి తొత్తులుగా మారి త‌మ వార్నింగ్స్ ను ప‌ట్టించుకోలేద‌న్నారు. త‌మ హెచ్చ‌రిక‌ల్ని ప‌ట్టించుకోకుండా బాక్సైట్ త‌వ్వ‌కాల‌కు వీలుగా ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించిన క్ర‌మంలోనే తాము వారిని అదుపులోకి తీసుకున్నామ‌ని.. ప్ర‌జా కోర్టులో విచారించిన‌ట్లుగా చెప్పారు. వారు తాము చేసిన త‌ప్పుల్ని ఒప్పుకున్నార‌ని.. అందుకే వారిని హ‌త‌మార్చిన‌ట్లుగా పేర్కొనటం గ‌మ‌నార్హం.


Tags:    

Similar News