భ‌గ్గుమ‌న్న మ‌హారాష్ట్ర..కార‌ణం ఏమంటే..?

Update: 2018-07-31 04:39 GMT
అప్ప‌టివ‌ర‌కూ అంతా నార్మ‌ల్‌ గానే ఉన్న‌ట్లు ఉండే కొన్ని రాష్ట్రాలు.. కొన్ని అంశాల విష‌యాల్లో గంట‌ల వ్య‌వ‌ధిలోనే మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా మ‌హారాష్ట్రలో అలాంటి ప‌రిస్థితే నెల‌కొంది. మ‌రాఠాల రిజ‌ర్వేష‌న్ల వ్య‌వ‌హారం ఇప్పుడా రాష్ట్రాన్ని భ‌గ్గుమ‌నేలా చేయ‌ట‌మే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నాయి. ఏమైనా స‌రే.. త‌మ డిమాండ్ల విష‌యంలో ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించాలంటూ మరాఠాలు త‌మ ఆందోళ‌న‌ల్ని తీవ్ర‌త‌రం చేస్తున్నారు. .

విద్యా.. ఉపాధి అవ‌కాశాల్లో త‌మ‌కు ప్ర‌త్యేక కోటా ఇవ్వాల‌న్న‌ది మ‌రాఠాల డిమాండ్‌. దీనిపై రోడ్లెక్కిన వారు.. త‌మ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు.. ఆందోళ‌న‌ల‌తో వాతావ‌ర‌ణాన్ని వేడెక్కించారు. ఇదిలా ఉంటే.. మ‌రాఠాల ఆగ్ర‌హాన్ని మ‌రింత పెంచేలా ఇద్ద‌రి ఆత్మ‌హ‌త్య‌ల కార‌ణంగా ప‌రిస్థితి మొత్తం మారిపోయింది. మ‌రాఠాలకు రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాలంటూ ఇద్ద‌రు బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డ‌గా.. వారిలో ఒక‌రు వేగంగా వెళుతున్న రైల్లో నుంచి  మ‌రాఠాల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ సూసైడ్ చేసుకున్నారు.

ఈ రెండు మ‌ర‌ణాలు మ‌రాఠాల్లో ఆవేశాన్ని మ‌రింత పెంచాయి. రోడ్ల మీద‌కు వ‌చ్చిన వారు ఆందోళ‌న‌ల‌తో స‌గం మ‌హారాష్ట్రను దిగ్బంధ‌నం చేశారు. పుణె.. నాసిక్ ల‌తో పాటు మ‌రాఠ్వాడాల అధిక్య‌త ఉన్న ప్రాంతాలన్ని ఆందోళ‌న‌ల‌తో అట్టుడికిపోతున్నాయి. ఉస్మానాబాద్‌.. షోలాపూర్.. న‌న్ ద‌ర్బార్.. ఔరంగాబాద్‌.. బీడ్ జిల్లాల‌న్ని బంద్‌ను సంపూర్ణంగా పాటించాయి.

ఈ ఆందోళ‌న‌ల కార‌ణంగా పుణెలో దాదాపు 40 బ‌స్సుల‌కు నిప్పు పెట్ట‌గా.. వంద‌కు పైగా చిన్నా.. పెద్దా వాహ‌నాల్ని ఆందోళ‌న‌ల‌కారులు ధ్వంసం చేశారు. పుణె నుంచి రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల‌ను క‌లిపే ర‌హ‌దారుల్ని దిగ్బంధ‌నం చేయ‌టంతో దారుల‌న్నీ స్తంభించాయి. గంట‌ల త‌ర‌బ‌డి ఆందోళ‌న‌కారులు హైవేల‌ను ఆక్ర‌మించారు. అనేక చోట్ల పోలీసుల పైనా.. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌పైనా రాళ్లు రువ్వారు.

ప్ర‌భుత్వం రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేసే వ‌ర‌కూ ప‌న్నులు చెల్లించ‌మ‌ని 22 జిల్లాల‌కు చెందిన నేత‌లు లాతూర్ లో జ‌రిగిన స‌మావేశంలో స్ప‌ష్టం చేశారు. కుల‌ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్ల‌కు భావోద్వేగంతో పాటు రాజ‌కీయ రంగు పులుముకోవ‌టంతో ప‌రిస్థితి అంత‌కంత‌కూ ఇబ్బందిక‌రంగా మారుతోంది. కాంగ్రెస్ తో పాటు.. నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీలే కాదు.. శివ‌సేన సైతం మ‌రాఠాల రిజ‌ర్వేష‌న్ల‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతోంది. ఈ వ్య‌వ‌హారంపై చ‌ర్చించేందుకు అసెంబ్లీని ప్ర‌త్యేకంగా స‌మావేశ‌ప‌ర్చాలంటూ సేన డిమాండ్ చేస్తోంది.

మారిన ప‌రిస్థితులతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఫ‌డ్న‌వీస్ స‌ర్కార్‌.. రిజ‌ర్వేష‌న్ల‌కు తాము సైతం అనుకూల‌మ‌నే పేర్కొంటూ.. తాము రిజ‌ర్వేష‌న్లు ఇచ్చినంత మాత్రాన కోర్టు ఒప్పుకుంటుందా? అని ప్ర‌శ్నించారు. కోర్టు పేరు చెప్పి భావోద్వేగాల్ని కంట్రోల్ చేసేలా ఫ‌డ్న‌వీస్ వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. కోర్టు ఓకే అంటే 16 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌ని వెల్ల‌డించారు. మ‌రాఠాల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల‌ని 2014లో రాష్ట్ర మంత్రివ‌ర్గం ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనిపై ముంబ‌యి హైకోర్టు స్టే ఇచ్చి నిలిపింది.

ఈ విష‌యాన్ని గుర్తు చేసేలా ఫ‌డ్నవీస్ మాట్లాడుతూ.. భావోద్వేగాలు మ‌రింత పెర‌గ‌కుండా ఉండేలా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. రిజ‌ర్వేష‌న్ల‌పై అధ్య‌య‌నం చేయ‌టానికి జ‌స్టిస్ గైక్వాడ్ నేతృత్వంలో వెనుక‌బ‌డిన వ‌ర్గాల క‌మిష‌న్ ను ఏర్పాటు చేశారు. ఈ క‌మిష‌న్ రాష్ట్రం మొత్తం ప‌ర్య‌టించి వెనుక‌బ‌డిన వ‌ర్గాల వివ‌రాల్ని సేక‌రించింది. నివేదిక పెండింగ్‌లో ఉంది. మ‌రి.. ఇలాంటి వేళ‌లో రిజ‌ర్వేష‌న్ల‌పై ఇంత‌లా ఆందోళ‌న‌లు పెల్లుబుక‌టానికి కార‌ణం ఏమిట‌న్న‌ది చూస్తే.. ఒక విష‌యం అర్థ‌మ‌వుతుంది.

ఇటీవ‌ల మ‌హారాష్ట్ర స‌ర్కారు 72వేల ఉద్యోగాల్ని భ‌ర్తీ చేసేందుకు ప్ర‌య‌త్నాల్ని షురూ చేసింది. దీంతో.. త‌మ ప్ర‌యోజ‌నాల‌కు భంగం వాటిల్ల‌నుంద‌న్న ఆగ్ర‌హ‌మే తాజా ఆందోళ‌న‌ల‌కు కార‌ణంగా చెబుతున్నారు. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్రలో 52 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌ల‌వుతున్నాయి మ‌రి.. మ‌రాఠాల డిమాండ్ల‌ను ఆమోదిస్తే.. రిజ‌ర్వేష‌న్ల ప‌రిమితి మ‌రింత పెరిగే వీలుంది. మ‌రీ.. చిక్కుముడిని ఫ‌డ్న‌వీస్ స‌ర్కార్ ఏ రీతిలో ప‌రిష్క‌రిస్తుంద‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News