సీఎం కేసీఆర్ ఎంతో ధైర్యంతో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఏకంగా 105మంది అభ్యర్థులను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కేసీఆర్ ముందస్తు ఊహాగానాలు తెలిసినా ఇంత ధైర్యం చేస్తాడని కాంగ్రెస్ నేతలు ఊహించలేదు. అందుకే ఉదాసీనంగా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఎన్నికలకు తెరలేపడంతో కాంగ్రెస్ నేతలంతా షాక్ అయ్యారు. ఏమీ పాలుపోని స్థితిలో పడ్డారు. ఒక్కసారిగా వచ్చిపడ్డ ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
ఇప్పటికిప్పుడు ముందస్తుకు సిద్ధం కావడం.. ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించడం.. ముందుకెళ్లడం సాధ్యం కాదని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత - మాజీ ఎమ్మెల్యే మర్రిశశిధర్ రెడ్డి హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ.. ముందస్తుతో కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలని చూస్తున్న కేసీఆర్ ప్రయత్నాలను అడ్డుకుంటామని.. ఇలా అసెంబ్లీని రద్దు చేయడంపై న్యాయసలహాలు తీసుకొని కోర్టుకు ఎక్కుతామని తాజాగా ప్రకటించారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికల వల్ల 20 లక్షల మంది ఓటుహక్కును కోల్పోతున్నారని.. ఇది ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ప్రభావితం చేస్తుందని.. అందుకే ఈ ఎన్నికలను ఆపాలని కాంగ్రెస్ కోర్టుకు వెళ్లబోతోందని ఆయన వివరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత - సుప్రీం కోర్టు లాయర్ అభిషేక్ సింగ్వితో చర్చించి త్వరలోనే సుప్రీంలో పిటీషన్ వేస్తామని శశిధర్ రెడ్డి వివరించారు.
దీన్ని బట్టి కాంగ్రెస్ కు ఎన్నికలకు వెళ్లడం కన్నా.. ఎన్నికలను కోర్టుతో అడ్డుకోవడానికే ప్రయత్నిస్తుందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. కేసీఆర్ ను ఎదుర్కోవడం కష్టమనే కాంగ్రెస్ ఈ ఎత్తులు వేస్తోందని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.