అంటార్కిటికాలో ఐస్‌ బ‌ర్గ్ విస్పోటం..కొత్త‌ టెన్ష‌న్!

Update: 2017-07-12 16:34 GMT
మంచుముద్ద‌కు మారు పేరుగా ఉండే అంటార్కిటికా అనూహ్యా మార్పు చోటుచేసుకుంది. వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా భారీ స్థాయిలో ఐస్ బ‌ర్గ్ బద్ధ‌లైంది. అమెరికాలోని ఓ చిన్న రాష్ట్రంతో స‌మాన‌మైన ఈ విస్పోట‌నం వ‌ల్ల స‌మీపంలోని స‌ర‌స్సుల్లో ప్ర‌వాహం పెరుగుతుంద‌ని క‌ల‌క‌లం మొద‌లైంది. స్వాన్సియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సైతం చీలికను ధ్రువీక‌రించ‌డంతో విస్పోట‌నం త‌దిత‌ర ప‌రిణామాల‌పై ప‌లు వ‌ర్గాల్లో టెన్ష‌న్ నెల‌కొంది.

అంటార్కిటికాలో సుమారు 5800 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల భారీ విస్తీర్ణం గ‌ల మంచుప‌ల‌కలో బ‌ద్ద‌లైన ఈ ప‌రిణామం కార‌ణంగా ట్రిలియ‌న్ ట‌న్నుల మంచు ముద్ద చీలిపోయింది. అమెరికాలోని ఎరీ అనే స‌ర‌స్సు కంటే రెండింత‌లు ఉండే ఈ మంచుప‌ల‌క క‌ర‌గ‌డం వ‌ల్ల స‌ముద్ర నీటి మ‌ట్టంలో గ‌ణ‌నీణ‌మైన మార్పులు ఉంటాయ‌ని స్వాన్సియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. గ‌త సోమ‌ - బుధ‌వారాల్లో జ‌రిగిన ఈ ప‌రిణామం వ‌ల్ల స‌ముద్రంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోనున్నాయి, తీర‌ ప్రాంతాల‌పై ఏ విధ‌మైన ప్ర‌భావం ఉంటుంద‌నే విష‌యంలో ప‌లు వ‌ర్గాల్లో ఉత్కంఠ నెల‌కొంది. శాస్త్రవేత్త‌లు ఇచ్చే తుది నివేదిక ఆధారంగా ఒక స్ప‌ష్ట‌త‌కు రానున్న‌ట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News