స్టే వస్తే.. జయలలిత మళ్లీ రాజీనామానా..?!

Update: 2015-06-27 06:00 GMT
ఒకవైపు ఆర్కే నగర్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్‌ జరుగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి హోదాను నిలబెట్టుకోవడానికి అమ్మ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. అన్నాడీఎంకే అధినేత్రి, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జయలలిత విషయంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. ఆస్తుల కేసులో జయలలిత దోషిగా నిర్ధారణ కావడం.. ఆ వెంటనే ఎమ్మెల్యే పదవిని, ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడం జరిగింది. ఇంతలోనే పై కోర్టుకు వెళ్లి జయలలిత నిర్దోషిగా బయటకు వచ్చింది. తిరిగితమిళనాడు సీఎం పదవిని సొంతం చేసుకొంది.

    ఈ నేపథ్యంలోనే మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆర్కేనగర్‌ నుంచి గెలవడం దాదాపు లాంఛనమే. మరి ఇలాంటి నేపథ్యంలో అమ్మ కు ఆల్‌ ఈజ్‌ వెల్‌ అనుకోవడానికి లేదు. ఎందుకంటే.. ఇప్పుడు ఆమెకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు.

    ఇప్పటికే ఆస్తుల కేసులో సుప్రీం కోర్టుకు వెళ్లాలనే నిర్ణయాన్ని తీసుకొంది కర్ణాటక ప్రభుత్వం. ఈ విషయంలో తమిళనాడు రాజకీయ పార్టీ డీఎంకే కూడా సుప్రీం కోర్టుకు వెళ్లడానికే సిద్ధం అయ్యింది. కర్ణాటక ప్రభుత్వంతో పాటు డీఎంకే కూడా పిటిషన్‌ వేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ పిటిషన్లలో కోరుతున్నది ఒకటే.. అన్నాడీఎంకే అధినేత్రి విషయంలో కర్ణాటక హై కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలి అనేది! మరి ఒకవేళ హై కోర్టు తీర్పుపై స్టే గనుక వస్తే.. విచారణకన్నా మునుపే ఇది జరిగితే అమ్మ పదవికి మళ్లీ మప్పు ముంచుకు వచ్చినట్టే నని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఇప్పుడు ఏ ం జరగబోతోందో!

Tags:    

Similar News