జెరూసలెం మత్తయ్య... ఓటుకు నోటు కేసు ఎంత సంచలనమైందో... ఆ కేసుకు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన జెరూసలెం మత్తయ్య కూడా అంతేస్థాయిలో సంచలనమయ్యారు. ఆయన కేసీఆర్ పఐ విజయవాడ సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ లో కేసు పెట్టడం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన అతంలో ఉన్నారు. తాజాగా ఆయన బయటకొచ్చి ఎక్కడున్నదీ వెల్లడించారు. మత్తయ్యను ఏపీ మంత్రులు రక్షిస్తున్నారన్న ఆర్పోణల నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. తాను ఆంధ్రప్రదేశ్ మంత్రుల సంరక్షణలో లేనని .. గుంటూరులోని అత్తగారి ఇంట్లో ఉన్నానని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పోలీసుల పైన నమ్మకం లేకనే తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన అత్తవారి ఇంట్లో ఉంటున్నానని ఆయన చెప్పారు. మంత్రులు తనకు రక్షణ ఇచ్చి ఆశ్రయం కల్పించినట్లు జరుగుతున్న ప్రచారం తప్పని చెప్పారు.
కాగా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రెండో రోజు సిట్ బృందం విచారణ కొనసాగుతోంది. విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక బృందం అధికార్లు సర్వీస్ ప్రొవైడర్లను విచారిస్తున్నారు. చిత్తూరు ఎస్పీ, సిట్ అధికారి జీ శ్రీనివాస్, అదనపు ఎస్పీలు దామోదర్, నరసింహారావుల ఆధ్వర్యంలో విచారణ జరగుతోంది. ఒక్కరొక్కరుగా సర్వీస్ ప్రొవైడర్లు వస్తున్నారు. ఎయిర్‌టెల్, ఐడియా, ఎయిర్‌సెల్, బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన సంస్థల ప్రతినిధులు సిట్ ఎదుట హాజరయ్యారు. టాపింగ్ వ్యవహారంలో రహస్యంగా టాపింగ్ చేసిన నెంబర్లకు ఎక్కడెక్కడ నుంచి కాల్స్‌వచ్చాయనే వివరాలు, కాల్ రికార్డులు, కాల్ డేటాలను అధికార్లకు సమర్పించినట్లు తెలుస్తోంది. సిట్ ఆదేశాలు తమకు వర్తించవని, రాష్ట్ర విభజన వల్ల విచారణ పరిధి లేదంటూ కొందరు సర్వీసు ప్రొవైడర్లు తప్పించుకోవడానికి చూసినా.... రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఏపీ సర్కిల్ పేరిటే వారు రెండు రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నందున తమ పరిధిలోకీ వస్తారంటూ పోలీసులు రివర్స్ కౌంటర్ ఇచ్చారు.