ఏపీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఆయన... ఎర్రచందనం స్మగ్లింగ్ లో అంతర్జాతీయస్థాయి నేరగాడు.. హత్యకేసులూ ఉన్నాయి... ఆ కేసుల్లో పడిన శిక్ష పూర్తి కాకుండానే పూర్తయినట్లుగా మ్యానేజి చేసి బయటపడిన మాయగాడు... ఈ సరికే అర్థమై ఉంటుంది.. ఆయన కొల్లం గంగిరెడ్డని... మారిషస్ లో ఉంటూ అక్కడి నుంచి ఉడాయించడానికి ట్రై చేసి అది కుదరక అక్కడే ఇరుక్కుపోయిన గంగిరెడ్డిని ఆంధ్రప్రదేశ్ కు రప్పించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు కానీ.. గంగిరెడ్డి కథ మాత్రం దాదాపుగా ఎండింగ్ కు వచ్చేసిందని సమాచారం.
మారిషస్ లో ఉన్న గంగిరెడ్డి గత నాలుగు నెలలుగా బెయిలు కోసం ప్రయత్నిస్తున్నా ఆయన ఎత్తులు పారలేదు. గంగిరెడ్డిపై ఇంకా శిక్షలు పెండింగులో ఉండడం... పాస్ పోర్టు కోసం తప్పుడు సమాచారం ఇవ్వడం... మారిషస్ అధికారులూ తప్పుడు సమాచారం ఇవ్వడం వంటి అభియోగాలను అక్కడ మోపారు. పది రోజుల కిందట గంగిరెడ్డి పెట్టుకున్న బెయిలు పిటిషన్ పై మారిషస్ కోర్టులో వాద ప్రతివాదాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు బలంగా ఉన్నాయి. కేసు తీర్పునకు సిద్ధంగా ఉంది. గంగిరెడ్డికి వ్యతిరేకంగా ఏపీ, ఇండియా గవర్నమెంట్లు... మారిషస్ ప్రభుత్వం సమర్పించిన ఆధారాల ప్రకారం ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవని సమాచారం. ఆయన్ను భారత్ కు అప్పగిస్తూ మారిషస్ కోర్టు తీర్పు ఇవ్వడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఆయన్ను ఏపీకి తీసుకొస్తే కేసులతో ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయం. ఆయన పాత నేరాలన్నీ పైకి తీస్తే ఫుల్లుగా బుక్కవడం గ్యారంటీ.