విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటనలో ఎంబీబీఎస్ విద్యార్థి మృతి.. ..!

Update: 2020-05-07 10:30 GMT
విశాఖపట్నం గ్యాస్ లీక్ దుర్ఘటనలో అనేక ఘోరాలు వెలుగు చూస్తున్నాయి. విశాఖ దుర్ఘటనలో గురువారం మధ్యాహ్నం వరకు 8 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. చనిపోయిన వారిలో ఆరేళ్ల చిన్నారి నుంచి 73 సంవత్సరాల వయసున్న వృద్ధుడి వరకు అన్ని వయసుల వారు ఉన్నారు. ఈ దుర్ఘటనలో విషవాయువు పీల్చి ఎంబీబీఎస్ విద్యార్థి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు.

చంద్రమౌళి ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. తమ కుమారుడు డాక్టరై ప్రజల ప్రాణాలు కాపాడతాడని తల్లిదండ్రులు ఆశిస్తే.. ఇంతలోనే విషవాయువు భావి డాక్టర్ ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన చంద్రమౌళి తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది.  

ఇదిలా ఉంటే  తెల్లవారుజామున పరిశ్రమను తెరవబోతుండగా.. స్టైరిన్ గ్యాస్ లీకై చుట్టుపక్కల ఉన్న వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం దాదాపు 1500 ఇళ్లను ప్రభుత్వం ఖాళీ చేయించింది. అక్కడి ప్రజలందర్నీ సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రస్తుతం 180 మంది కేజీహెచ్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 40 మందిని అపోలో ఆస్పత్రికి తరలించారు.
Tags:    

Similar News