పాకిస్తాన్ కు అంతర్జాతీయ వేదికపై భారత్ షాకిచ్చింది. ఘోరంగా అవమానించింది. గూఢచర్యం కేసులో మరణశిక్ష పడి పాకిస్తాన్ జైల్లో ఏళ్ల తరబడి మగ్గుతున్న భారత నౌకదళ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కేసులో వాదనల ప్రారంభానికి ముందు పాకిస్తాన్ స్నేహాన్ని భారత్ కాలదన్ని సంచలనం సృష్టించింది.
ఈ విచారణకు భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి దీపక్ మిట్టల్ హాజరయ్యారు. పాకిస్తాన్ తరుఫున అటార్నీ జనరల్ అన్వర్ మన్సూర్ ఖాన్ పాల్గొన్నారు. అన్వర్ స్వయంగా లేచి దీపక్ వద్దకు వచ్చి కరచాలనానికి చెయ్యి చాపారు. కానీ దీపక్ దాన్ని పట్టించుకోకుండా కేవలం ఒక నమస్కారం పెట్టి ముందుకు సాగారు. అసలు పాకిస్తాన్ అటార్నీ జనరల్ ను పట్టించుకోలేదు. తనను పట్టించుకోకపోవడంతో అన్వర్ అలిగి వెళ్లిపోయి తన సీటులో కూర్చున్నారు.
వీరిద్దరూ ఎదురుపడ్డ దృశ్యాలు, వీడియోలు వైరల్ గా మారాయి. పాకిస్తాన్ కు భారత్ తగిన బుద్ది చెప్పిందని భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి దీపక్ మిట్టల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలైన భారతీయతకు మిట్టల్ నిర్వచనం చెప్పాడని నెటిజన్లు కొనియాడుతున్నారు.