80 కాస్తా 60 అన్నారంటే.. సంచ‌ల‌న‌మే!

Update: 2018-11-04 10:41 GMT
పెద్ద పెద్ద ఉదాహ‌ర‌ణ‌లు.. అంత‌కు మించిన విశ్లేష‌ణ‌ల్ని ప‌క్క‌న పెడ‌దాం. మీరు ఎవ‌రినైనా హీరో అంటే ఇష్టం అనుకుందాం. ఆ హీరో మూవీ అట్ట‌ర్ ప్లాప్ అయ్యింద‌నుకుందాం. ఎలా ఉంద‌ని అడిగితే ఏమంటామ్‌?.. ఓకే అనేస్తాం. అదే సూప‌ర్ డూప‌ర‌ర్ హిట్ అయ్యింద‌నుకుందాం.. ఏమ‌ని బ‌దులిస్తాం. మొత్తంగా ఏమ‌ని అర్థ‌మ‌వుతుందంటే.. సానుకూలంగాఉంటే గొప్ప‌గా చెప్పుకోవ‌టం.. త‌క్కువ‌గా ఉంటే ఆ న‌ష్టాన్ని వీలైనంత త‌గ్గించి చెప్పే ధోర‌ణి మ‌నుషుల్లో మామూలే.

తాజాగా కేసీఆర్‌ కు అత్యంత స‌న్నిహితుడిగా.. మీడియా అధినేత‌గా.. కేసీఆర్ ను మోసేందుకు తన తాప‌త్రాయాన్ని ప్ర‌ద‌ర్శించే పెద్ద మ‌నిషి ఆ మ‌ధ్య‌న తెలంగాణ‌లో టీఆర్ ఎస్‌ కు 80 సీట్లు వ‌స్తాయంటూ బ‌ల్ల‌గుద్ది వాదించిన‌ట్లుగా తేల్చేశారు. ముంద‌స్తు ఎన్నిక‌ల ఫ‌లితం లెక్క తేలిపోయిన‌ట్లేన‌ని.. మ‌ళ్లీ సీఎం కేసీఆరేన‌ని తేల్చేశారు. ఈ సంద‌ర్భంగా స‌ద‌రు మీడియా అధినేత‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

అంత‌లా ఎలా చెబుతారని.. గ్రౌండ్ రియాలిటీని మ‌సిపూసి మారేడుకాయ ఎలా చేస్తార‌న్న ప్ర‌శ్నకు స‌మాధానం రాని ప‌రిస్థితి. నెల‌న్న‌ర గ‌డిచిందో లేదో తాజాగా.. అదే మీడియా పెద్ద ఒక భారీ విశ్లేష‌ణ చేశారు. కేసీఆర్ గెలుపు అవ‌కాశాల మీద ఆయ‌న ప‌లు కోణాల్లో చ‌ర్చ‌కు పెట్టారు.  కేసీఆర్‌ కు ద‌న్నుగా మాట్లాడే ఆయ‌న టోన్ ఈసారి మారింది. మొన్నీమ‌ధ్య‌నే బ‌రాబ‌ర్ 80 స్థానాలు అన్న స్థానే.. 60 రావొచ్చ‌ని.. ఫైట్ చాలా టైట్ గా ఉందంటూ తేల్చి చెప్పారు.

ఉన్న‌ట్లుండి స‌ద‌రు మీడియా సంస్థ టోన్ లో ఎందుకు మార్పు వ‌చ్చింది?  అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ప్ర‌జ‌ల్లో కేసీఆర్ సారుకున్న అహంకారం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంద‌ని.. కేసీఆర్‌ స్థానే కేటీఆర్ అంతా చ‌క్రం తిప్ప‌టం అస్స‌లు న‌చ్చ‌టం లేద‌న్న మాట‌ను చెప్పుకొచ్చారు. కేసీఆర్ కు వ‌చ్చే స్థానాలకు సంబంధించి 80 నుంచి 60కు దించేసిన మీడియా పెద్దాయ‌న ఎందుకిలా చేశారంటే.. ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

అందులో ఒక‌టి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితంగా ఉండే పెద్దాయ‌న‌.. బాబు తీసుకొస్తున్న మ‌హాకూట‌మికి బాజా ఊదాల్సి ఉండ‌టంతో.. అందులో భాగంగానే తాజాగా విశ్లేష‌ణ చేసి ఉంటార‌ని చెబుతున్నారు. ఇంత‌కాలం కేసీఆర్ సారుకు వీర భ‌క్తుడిగా వ్య‌వ‌హ‌రించే స‌ద‌రు మీడియా పెద్ద ఇప్పుడు త‌న అస‌లు రంగును బ‌య‌ట‌పెట్టార‌ని.. అందుకే కేసీఆర్ మీద త‌న‌కున్న అసంతృప్తిని త‌న‌దైన శైలిలో బ‌య‌ట‌పెట్టిన‌ట్లుగా విశ్లేషిస్తున్నారు. ఇందులో నిజం లెక్క తేలాలంటే కొంత‌కాలం వెయిట్ చేస్తే మ‌రిన్ని విష‌యాల‌పై క్లారిటీ రావ‌టం ఖాయ‌మంటున్నారు. ఏమైనా నెల వ్య‌వ‌ధిలో 80 కాస్తా 60 సీట్ల‌కు కేసీఆర్ అండ్ కో గెలుపు అవ‌కాశాలు త‌గ్గిపోయాయన్న మాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News