పవర్ ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయి? అదే పవర్ చేజారితే పరిస్థితులు ఎలా ఉంటాయన్న విషయాన్ని చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. కొన్ని నెలల క్రితం తెలంగాణ అసెంబ్లీని వేదికగా చేసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రజంటేషన్ ను చేస్తున్నవేళ.. తెలంగాణలోని ఛానళ్లు అన్నీ.. కార్యక్రమం మొదలు నుంచి చివరి వరకూ మధ్యలో ఎలాంటి బ్రేక్ లేకుండా.. కమర్షియల్ పోగ్రాం ఉన్నా ఆ విషయాన్ని వదిలేసి మరీ.. లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు.
నిజమే.. ఒక ముఖ్యమంత్రి మొదటిసారి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వటం.. అది కూడా అసెంబ్లీలో అన్నది కొత్త కాన్సెప్ట్. కానీ.. నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రజంటేషన్ మొత్తం తప్పుల తడక అని.. రూ.1.50లక్షల కోట్ల కుంభకోణమంటూ కాంగ్రెస్ పార్టీ అసలైన జల దృశ్యం అంటూ రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరుగుతూ ప్రజంటేషన్ మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రజంటేషన్ కు కౌంటర్ చేస్తూ తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం ప్రజంటేషన్ ఇచ్చిన వేళ.. న్యూస్ ఛానళ్లలో ఎన్ని లైవ్ టెలికాస్ట్ ఇచ్చాయన్న విషయాన్ని చూస్తే.. ముక్కున వేలేసుకోవాల్సిందే.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ షురూ చేసిన ప్రజంటేషన్ ను మధ్యాహ్నం రెండు గంటల వేళ షురూ చేస్తే.. ఒకే ఒక్క ప్రముఖ ఛానల్ మినహా మిగిలిన చానళ్లు ఏమీ టెలికాస్ట్ చేయటం గమనార్హం. కొద్దిసేపటి తర్వాత చెక్ చేస్తే.. మరికొన్ని ఛానళ్లు మాత్రమే లైవ్ టెలికాస్ట్ చేస్తున్న పరిస్థితి. ప్రముఖ ఛానళ్లుగా పేర్కొందిన కొన్ని ఛానళ్లు అసలు ఇలాంటి కార్యక్రమాన్ని ఒకటి జరుగుతుందన్న ప్రస్తావన తీసురాకుండా తమ బులిటెన్లను నడిపించేయటం గమనార్హం.
ఒక ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రజంటేషన్ కు కౌంటర్ గా ప్రధాన ప్రతిపక్షం ఇస్తున్నప్పుడు ఆ వాదనను ప్రజలకు వినిపించాల్సిన బాధ్యత మీడియా మీద ఉంటుందన్నది మర్చిపోకూడదు. కానీ.. అలాంటిదేమీ లేకుండా పెద్ద ప్రాధాన్యత ఇవ్వకుండా.. మధ్య మధ్యలో కమర్షియల్స్ వేస్తూ బండి లాగిస్తున్న ఛానళ్లను చూస్తే.. నాడు సీఎం ప్రజంటేషన్ సమయంలో సెకను సైతం ఆపటానికి సిద్ధపడని ఛానళ్లు.. తాజా ప్రజంటేషన్ విషయంలో మాత్రం ఏమాత్రం సీరియస్ నెస్ కనిపించని పరిస్థితి. ఇదంతా చూసినప్పుడే.. పవర్ కు ప్రతిపక్షానికి మధ్యనున్న అంతరం ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.