యాంటీ క్లైమాక్స్ అంటే ఇదే. అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో ఇండియన్ మీడియా అనుకున్నది.. ప్రచారం చేసింది ఒకటి. కానీ వాస్తవంగా జరిగింది మరొకటి. భారతీయులపై కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడన్న కారణంతో మన మీడియా మొదట్నుంచి ట్రంప్ మీద కత్తి కట్టినట్లుగా వ్యవహరించింది. ఆయన విషయంలో వార్తల్ని ఎగ్జాజరేట్ చేసి ప్రచారం చేసింది.
ట్రంపు.. కంపు అంటూ మనవాళ్లు కూడా పెద్ద ఎత్తున నెగెటివ్ పబ్లిసిటీ చేశారు. తన రసికతకు సంబంధించిన కొన్ని విషయాల్ని ట్రంప్ బయటపెట్టడం.. ఆయన అమ్మాయిలతో కలిసి ఉన్న ఫొటోలు బయటికి రావడంతో.. వాటిని పట్టుకుని ట్రంప్ ను అమ్మాయిల పిచ్చోడిగా చిత్రీకరించాడు. మీడియా స్వేచ్ఛ పేరుతో అతి చేశారు. ట్రంప్ ను తిడితే అడిగేవాడు లేడు కాబట్టి హద్దులు మీరి వ్యాఖ్యానాలు చేశారు. ట్రంప్ ఎన్నికల్లో మట్టికొట్టుకు పోతాడని.. హిల్లరీ ప్రభంజనం ముందు నిలవలేడని.. అసలు పోటీ ఇచ్చినా గొప్పే అని తీర్పులిచ్చారు.కానీ తీరా ఫలితం చూస్తే తిరగబడింది. ట్రంప్ అద్భుత రీతిలో గెలిచేశాడు.
ఇప్పుడు మన మీడియా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఉదయం నుంచి మన నేషనల్.. లోకల్ మీడియా డీలా పడింది.మన మీడియా విశ్వసనీయతను అమెరికా ఎన్నికల ఫలితాలు బాగా దెబ్బ తీశాయి. ఈ ఫలితాల్ని మన మీడియాకు చెంపెపెట్టుగా భావిస్తున్నారు. ఏ విషయంలో అయినా హద్దులు దాటి ప్రవర్తించకూడదు.. అతి చేయకూడదు అనడానికి ఈ ఫలితాలు సరైన ఉదాహరణ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/