సోషల్ మీడియా పుణ్యమా అని అనవసరమైన చెత్త రోజుకు టన్నులు టన్నులు ముంచెత్తుతున్నా.. కొన్ని ముఖ్యమైన విషయాలు ఇదే చెత్తలో నుంచి ఆణిముత్యాల మాదిరి బయటకు వస్తున్నాయి. సమాజంలోని భిన్న కోణాల్ని.. వికృత పార్శాల్ని బయటపెడుతూ ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి తెర మీదకు వచ్చింది.
ఒక హిందూ యువతి ఒక ముస్లిం కుర్రాడితో డేటింగ్ చేస్తుందంటూ వీహెచ్ పీ కార్యకర్తలు పోలీసు స్టేషన్ కు తీసుకెళితే.. అక్కడి పోలీసులు అనుసరించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కు చెందిన 20 ఏళ్ల హిందూ యువతికి ఒక ముస్లిం కుర్రాడితో చనువుగా ఉంటోంది. వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. మేజర్లు అయిన ఈ ఇద్దరి డేటింగ్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వీహెచ్ పీ కార్యకర్తలు లవ్ జిహాద్ అంటూ వారిద్దరిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.
హిందూ యువతిని ఆమె పేరెంట్స్ దగ్గరకు తీసుకెళ్లేందుకు పోలీసు వాహనం ఎక్కించారు. హోంగార్డు ఒకరు వాహనం నడుపుతుంటే.. లేడీ కానిస్టేబుల్ సదరు హిందూ యువతి ముఖానికి ఉన్న స్కార్ప్ ను తీసి.. జుట్టు పట్టుకొని కొట్టటం సంచలనంగా మారింది. అంతేనా.. ముస్లిం యువకుడితో డేటింగ్ చేయటం నీకు సిగ్గు అనిపించటం లేదా? అంటూ సదరు కానిస్టేబుల్ నుంచి ఆమె చుట్టూ ఉన్న మరికొందరు పోలీసు కానిస్టేబుల్స్ తిట్టటం మొదలు పెట్టారు.
ఈ మొత్తం ఉదంతాన్ని రహస్యంగా వీడియో తీసిన వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం ఈ వ్యవహారం బయటకు వచ్చి సంచలనంగా మారింది. మత సామరస్యాన్ని పోలీసులు దెబ్బ తీస్తున్నట్లుగా పలువురు మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారం అతి ప్రదర్శించిన లేడీ కానిస్టేబుల్ ప్రియాంకతో పాటు హోంగార్డు సైన్ సెర్పాల్.. హెడ్ కానిస్టేబుల్ సలేక్ చంద్.. మరో కానిస్టేబుల్ నీతూ సింగ్ లను సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. మేజర్లు అయిన ఇద్దరు ఎవరికి నచ్చిన వారితో వారు ప్రేమలో పడతారు. డేటింగ్ చేస్తారు. అందుకు పోలీసులు ఈ తరహాలో వ్యవహరించటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.