జనసేనకు మెగాస్టార్ బ్లెస్సింగ్స్...?

Update: 2022-09-03 07:46 GMT
జనసేన తమ్ముడి పార్టీ. ఎనిమిదేళ్ళుగా పవన్ కళ్యాణ్ తన పార్టీని అలా నడిపించుకుని వస్తున్నారు. తొలి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఒక బ్లండర్ మిస్టేక్ చేశారు అని ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులు అంటారు. రెండవ ఎన్నికలో కూడా ఆయన సరైన నినాదం అందుకోలేదని, విపక్ష పార్టీగా నాడు ఉన్న వైసీపీని విమర్శించడంతో ఒక గోల్డెన్ చాన్స్ కోల్పోయాడని కూడా అంటారు. ఇక 2024 ఎన్నికలకు పవన్ రెడీ అవుతున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పవన్ ఈసారి ఎలాగైనా తన సత్తా చాటాలనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే 2014లో పవన్ ఒంటరిగా వచ్చారు. 2019 నాటికి మెగా బ్రదర్ నాగబాబు తమ్ముడికి తోడుగా వచ్చి పోటీ కూడా చేశారు. ఇక 2024 నాటికి టోటల్ మెగా ఫ్యామిలీ అంతా జనసేన వెనక ఉంటుంది అని అంటున్నారు. ఇప్పటిక పవన్ తల్లి నుంచి సోదరుడు నుంచి టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ కౌలు రైతులకు సాయం కోసం విరాళాలు ఇచ్చారు. సరే వీరందరి సంగతి పక్కన పెడితే టోటల్ మెగా ఫ్యామిలీకి మూలాధరం అయిన మెగాస్టార్ మద్దతు జనసేనకు ఉంటుందా అన్న చర్చ ఎపుడూ సాగుతూ వస్తూనే ఉంది.

మెగాస్టార్ తనకు రాజకీయలతో పనిలేదనుకుని తిరిగి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఆయనకు ప్రజారాజ్యం రూపంలో చేదు అనుభవం ఉంది. కాబట్టి ఆయన నో పాలిటిక్స్ అనేస్తున్నారు. అంతమాత్రాన ఆయన తమ్ముడి పార్టీకి కాకుండా బయట వారికి మద్దతుగా ఉంటారనుకోవడం కూడా పొరపాటే అవుతుంది.  చిరంజీవికి తమ్ముడు పవన్ అంటే ఎంత ఇష్టమో అనేక పబ్లిక్ వేదికల మీదనే చెప్పుకున్నారు.

తాజాగా ఒక సినిమా ఫంక్షన్లో చిరంజీవి మాట్లాడుతూ అందరి కంటే ముందే తాను తమ్ముడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచెస్తున్నాను అని చెప్పారు. ఇక పుట్టిన రోజు వేళ ఎందరో ప్రముఖులు పవన్ ని గ్రీట్ చేశారు. కానీ పెద్దన్న గారు, మెగాస్టార్ అయిన చిరంజీవి చేసిన ట్వీట్ అయితే చర్చనీయాశం అయింది. ఆయన తమ్ముడి మనసులో ఎపుడూ జనమే ఉంటారని, జనం కోసం ఆయన తపన పడతారని చెబుతూ ఈ విషయంలో  తమ్ముడు విజయవంతం కావాలని మనసారా కోరుకున్నారు.

అంటే పవన్ జనసేనానిగా దూసుకుపోవాలని ఆయన కోరుకుంటున్నట్లుగా అందలం ఎక్కాలని అన్న గారు ఆశీర్వదించారు అన్న మాట. దీంతో టోటల్ పవన్ ఫ్యాన్స్ జనసైనికులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఆ మధ్యన కూడా నాదెండ్ల మనోహర్ నాగబాబు వంటి వారు కూడా మెగాస్టార్ బ్లెస్సింగ్స్ తమకు ఎపుడూ ఉంటాయని చెప్పుకున్నారు. ఇపుడు దానికి తగినట్లుగానే చిరంజీవి నిండు దీవెనలు తెలియచేశారు. నిజానికి చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నా అలాగే వైఎస్ జగన్ వంటి వారితో సినీ పెద్దగా చర్చలు జరుపుతూ సన్నిహితంగా ఉంటున్నా రాజకీయంగా చూస్తే ఆయన ఏ ఇతర పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తి ఉండదని అంటున్నారు.

ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో కూడా చిరంజీవి తనకు రాజకీయాల మీద ఆసక్తి లేదని, తమ ఇంట్లోనే ఒక పార్టీ ఉందని అయినా తాను వద్దు అనుకున్నాను అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో మెగా హీరోలు చాలా మంది జనసేనకు మద్దతుగా ప్రచారంలోకి దిగుతారు అని అంటున్నారు. ఇక మెగాస్టార్ నేరుగా ప్రచారం చేయకపోయినా ఆయన ఒక ట్వీట్ అయినా జనసేనకు అనుకూలంగా వేస్తారని అంటున్నారు. మొత్తానికి పవన్ జనం కోసం సాగిస్తున్న పోరాటంలో విజయం సాధించాలను కోరుకునే అన్నయ్య తన వంతుగా ఎంతో కొంత సాయం చేయకుండా ఉండరని అంటున్నారు.  మెగాస్టార్ కనుక ఇండైరెక్ట్ గా మద్దతు ఇచ్చినా అది జనసేనకు కొండంత బలం అవుతుంది అని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News