ఫ్యాషన్ షోకు వెళ్లేందుకు ఎలా రెడీ కావాలో పరామర్శకు అదే రీతిలో రెఢీ అయిన అమెరికా ఫస్ట్ లేడీ తీరు అమెరికన్లను విస్తుపోయేలా చేసింది. అమెరికా చరిత్రలో అత్యంత దారుణమైన హార్వే హరికేన్ తీవ్రతకు కోట్లాది మంది ప్రభావితమైన వేళ.. వారిని పరామర్శించేందుకు వెళ్లిన ట్రంప్ సతీమణి సోకు.. అమెరికన్లకు షాకింగ్ గా మారింది.
గడిచిన మూడు రోజులుగా హార్వే హరికేన్ దెబ్బకు టెక్సస్ రాష్ట్రం దారుణంగా దెబ్బ తింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రకృతి వైపరీత్యాన్ని పరిశీలించేందుకు అమెరికా అధ్యక్షులు ఏరియల్ సర్వే నిర్వహించారు. ట్రంప్ హయాంలో చోటు చేసుకున్న అతి పెద్ద విలయంగా అభివర్ణిస్తున్న వేళ.. ప్రకృతి విసిరిన సవాలతో కిందామీదా పడుతున్న అమెరికన్లకు.. తమ ప్రధమ మహిళ సోకుగా తయారై రావటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.
అన్నింటికి మించి వరద ప్రాంతాల్లో సందర్శించేందుకు ఆమె తయారైన తీరు.. మరీ ఎత్తుగా ఉన్న పాయింట్ హైహిల్స్ పై పలువురు తప్పు పడుతున్నారు. ప్రజలంతా వరద కష్టాలతో ఉన్న వేళ.. మరీ ఇంత ఫ్యాషన్ గా తయారై రావటం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. టైలర్డ్ కాప్రి ప్యాంట్.. ఆర్మీ గ్రీన్ కలర్ బాంబర్ జాకెట్.. ఏవియేటర్ సన్ గ్లాసెస్.. స్కై-హై హిల్స్ షూను మెలానియా ధరించారు. ఇక.. అధ్యక్షుడైన ట్రంప్ హుడెడ్ రెయిన్ జాకెట్.. ఖాకీ రంగు ఫ్యాంటు.. ముదురు రంగు బూట్లు ధరించారు. వీరి సోకులపై సోషల్ మీడియాలోనెటిజన్లు పలువురు తప్పు పడుతున్నారు.
వరద పోటెత్తిన ప్రాంతాల్లో పరామర్శకు వెళ్లిన మెలానియాను చూస్తే.. వరదల్ని చూసేందుకు వచ్చిన బార్బీలా ఉందన్న ఘాటు విమర్శను చేస్తున్నారు. మెలానియా సోకుల మీద మరో నెటిజన్ రియాక్ట్ అవుతూ.. టెక్సాస్ వాసులారా భయపడకండి.. మీకు తప్పక సాయం అందుతుంది. ఎందుకంటే.. మెలానియా తుపాను అంత ఎత్తున్న హైహీల్స్ వేసుకుందని విరుచుకుపడ్డారు.