అందాల పోటీలంటేనే పౌడర్లు, స్నోలు ఇలా తట్టెడు ముఖానికి రాసుకొని చాలా అందంగా ముస్తాబై క్యాట్ వాక్ చేయాలి. అలా చేస్తున్న వారిని చూసి ప్రేక్షకులు జడ్జీలు సొల్లు కార్చాలి. ఆమాత్రం మేకప్ లేకుండా ఏ అందగత్తె కూడా అందాల పోటీల్లో అస్సలు పాల్గొనదంటే అతిశయోక్తి కాదు.. మేకప్ లేకుండా హీరోయిన్లను, హీరోలను చూస్తే రాత్రి కలలోకి వస్తారు. అలాంటిది మేకప్ లేకుండానే ఓ అమ్మాయి అందాల పోటీల్లో పాల్గొని ఔరా అనిపించింది. బాహ్య సౌందర్యం కంటే కూడా అంత: సౌందర్యం ముఖ్యమని నిరూపించాలనుకుంది.
మేకప్ లేకుండా పోటీల్లో పాల్గొనడమే ఓ పెద్ద సాహసమైతే ఈమె ఏకంగా మిస్ ఇంగ్లండ్ పోటీల్లో పాల్గొని అదరగొట్టింది. మేకప్ లేకుండా పోటీలో పాల్గొనడమే కాకుండా ఏకంగా ఫైనల్ కు చేరి రికార్డ్ నెలకొల్పింది. దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉన్న మిస్ ఇంగ్లండ్ పోటీల్లో మేకప్ లేకుండా పోటీచేయడం ఇదే మొట్టమొదటి సారి. మనం సంతోషంగా ఉంటే మన ముఖాన్ని మేకప్ తో కప్పుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. అందాల పోటీల విషయంలో అమ్మాయిలపై కొనసాగుతున్న వివక్షను తొలగించాలని భావించింది.
మిస్ ఇంగ్లండ్ పోటీలను దాదాపు 100 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. పోటీల్లో పాల్గొనే అమ్మాయిలందరూ మేకప్ వేసుకునే వస్తారు. తాజాగా మెలిసా రవూఫ్ అనే అమ్మాయి మాత్రం బాహ్య సౌందర్యం కంటే అంత: సౌందర్యమే ముఖ్యమని చెబుతూ మేకప్ లేకుండా పోటీల్లో పాల్గొంది. ఏకంగా ఫైనల్ చేసి రికార్డు నెలకొల్పింది.
లండన్ లో పొలిటికల్ సైన్స్ చదువుతోన్న మెలిసా మిస్ ఇంగ్లండ్ పోటీల్లో సెమీఫైనల్ లోనూ జడ్జీలను మెప్పించి ఫైనల్ కు వెళ్లింది. అక్టోబర్ లో జరిగే పోటీల్లో 40 మంది అమ్మాయిలతో కలిసి మిస్ ఇంగ్లండ్ కిరీటం కోసం ఆమె పోటీ పడనుంది.
మేకప్ లేకుండా ఫైనల్ చేరడంతో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆమె మీడియాతో మాట్లాడుతూ అందం పట్ల అమ్మాయిలు ఆత్మనూన్యత భావానికి గురికావద్దని.. ఈ సందేశాన్ని ఇవ్వడానికే పోటీల్లో పాల్గొనే సమయంలోనూ తాను మేకప్ వేసుకోలేదని చెప్పింది. మనం సంతోషంగా ఉంటే మన ముఖాన్ని మేకప్ తో కప్పుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.