జంతు ప్రేమికులకు మాత్రమే కాదు.. ఎవ్వరికైనా మనసు కరిగిపోయేలా చేసిన ఘటన ఇది. ఒక గాడిదను నిస్సహాయ స్థితిలోకి నెట్టి.. ప్రాణం కోసం అది గిలగిలలాడిపోతుంటే వినోదం చూసిన జూ సిబ్బందిని తిట్టుకోని వాళ్లు లేరు. పులులకు ఆహారంగా మాంసం పెట్టడానికి వేరే జంతువుల్ని చంపడం కొత్తేమీ కాదు. కానీ అది చాటుగా జరిగే వ్యవహారం.
జంతువుల్ని మనుషులే చంపి తీసుకొచ్చి.. మాంసాన్ని పులులకు ఆహారంగా వేస్తుంటారు. కానీ చైనాలోని ఒక జూకు చెందిన సిబ్బంది మాత్రం ఇలా చేయకుండా చాలా కర్కశంగా ప్రవర్తించారు. ఒక గాడిదను బతికుండగానే పులుల ముందు పడేయడం.. అవి దాని మీద పాశవికంగా దాడి చేసి.. ప్రాణాలు తీసి విందు ఆరగిస్తుంటే చూసి సంతోషించడం.. అన్నది దారుణమైన విషయం.
పులులకు ఆహారంగా తీసుకొచ్చి గాడిదను వ్యాన్ నుంచి జూ సిబ్బంది కిందికి దించి.. పులులుండే చోట కొలనులోకి తోసేస్తే.. ఒకదాని తర్వాత ఒక పులి దాని మీదికి దూకి.. దాని మెడను కొరికి.. రక్తం తాగి.. దాన్ని చీల్చి చెండాడి.. అది చచ్చాక దాని మాంసాన్ని ఆరగించాయి. ఆ గాడిద ప్రాణం కాపాడుకోవడానికి విలవిలలాడిన తీరు చూస్తే కన్నీళ్లు రాకమానవు. ఆ జూ సిబ్బంది దారుణ ప్రవర్తనను పర్యాటకులు వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడది వైరల్ అవుతోంది. జూ సిబ్బంది మీద జనాలు మండిపడుతున్నారు.
Full View