మగాళ్లు.. ఇది మన రోజు.. పండుగ చేసుకోండి

Update: 2019-10-25 05:52 GMT
ఎన్ని బాధలు ఉన్నా మౌనంగా భరిస్తాడు. కుటుంభాన్ని ఎంతో బాధ్యతగా అన్నీ తానై నడిపిస్తాడు. ఏడ్చే మగాన్ని నమ్మవద్దనే సమాజపు సూటి పోటి మాటలను సైతం భరిస్తాడు. కష్టాలు వచ్చిన దుఃఖాన్ని దిగమింగుకుంటాడు. భర్త అంటే భరించే వాడుగానే ప్రస్తుత సమాజంలో మిగిలిపోయాడు. భార్యకు మార్గదర్శిగా అవుతున్నాడు. ఉన్నత శిఖరాలకు తోడై నిలుస్తున్నాడు. తండ్రి నుంచి తాత వరకు అనేక సందర్భాల్లో పెద్దరికం పాత్ర పోషిస్తున్నా.. భర్తగా ఉండే కాలం మాత్రం కీలకంగా చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో  చికాకులు పడడానికి అనేక కారణాలు ఉన్నాయి.

 భార్య పంచుకుంటే భర్తకు మేలు..

ఇంటి బాధ్యతలను భార్య సమర్ధవంతంగా నిర్వహించినప్పుడు మగాడికి కాస్త ఊరట లభిస్తుంది. పిల్లల ఎదుగుదలలో కీలక పాత్ర పోషించడం... ఇంటి చికాకులు తగ్గించడంలో భార్య పోషిస్తున్న పాత్రతోనే భర్తకు ప్రశాంతత లభిస్తుంది. విధి నిర్వహణలో ప్రశాంతంగా ఉండే పరిస్థితి భర్తకు లభించడం ఒక కారణం కావచ్చు.

*భర్తలు మారారు..

ఆధునిక కాలంలో అధిపత్య భావజాలాన్ని వీడుతున్న భర్తలు.. భార్యలకు మార్గదర్శిగా ఉంటున్నారు. ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా ప్రోత్సహాన్నిచ్చే భర్తలు ఉన్నారు. భార్య భర్తల మధ్య ఎటువంటి అరమరికలు లేకుండా అహం దరిచేరనివ్వకుండా ఉంటే అ కుటుంబం అనందంగా సాగిపోతుంది. పెండ్లిలో వేదమంత్రాల మధ్య ఏడడుగులు నడిచి సర్వకాల సర్వావస్థలో తోడుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన బాసలను నిలుపుకుంటున్నారు. ఇరవై ఏండ్లు తాను పుట్టిపెరిగిన వాతావరణాన్ని కాదని, తనను నమ్మి వచ్చిన వ్యక్తిని బాధ్యతగా చూసుకుంటున్నాడు.

 తగాదాలతో జీవితం నాశనం..

కానీ ఆధునిక యుగంలో భార్యభర్తల మధ్య సమస్యలు కూడా వస్తున్నాయి. చిన్న చిన్న తగాదాలు పెంచి పోషించుకుంటున్నారు. కొన్ని కుటుంబాల్లో అర్థిక ఇబ్బందులు కూడా భార్యభర్తల మధ్య అనురాగం బదులు ద్వేషాలు కూడా పెరుగుతున్నాయి. ఎవరిది తప్పు అనే మాట ఎలా ఉన్నా భార్యభర్తల తగదాలు పిల్లలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. భార్యలను ఇబ్బందులకు గురిచేస్తున్న భర్తలు ఉన్నారు. రకరకాల వేధింపులకు భర్తలను గురిచేస్తున్న భార్యలు ఉన్నారు. కానీ ఆధునిక సమాజంలో కుటుంబ పోషణతో పాటు, ఎన్నో బాధ్యతలను భర్త నిర్వర్తిస్తున్నాడు. ఉన్నత పదవులకు, ఉద్యోగులుగా ఎదిగిన మహిళల విజయం వెనుక భర్తలు ఉన్నారు. భార్యకు స్నేహితులుగా గైడ్‌గా ఉంటున్న భర్తలను గౌరవించడానికి అక్టోబర్‌ 25న భర్తల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. భర్తల దినోత్సవం సందర్భంగా మగాళ్ల త్యాగాలను ఇప్పటికైనా గౌరవిద్దాం..
Tags:    

Similar News